AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు షాకింగ్ న్యూస్‌..ఇక‌పై

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆర్బీఐ ఖాతాదారుల‌కు ఊర‌ట క‌లిగించేలా మార‌టోరియం ఆప్ష‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, అదే అప్ష‌న్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌ వినియోగ‌దారులకు షాక్ ఇవ్వ‌నుంది.

క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు షాకింగ్ న్యూస్‌..ఇక‌పై
Jyothi Gadda
|

Updated on: Apr 28, 2020 | 12:59 PM

Share

క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు ఆయా బ్యాంకులు షాక్ఇచ్చాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆర్బీఐ ఖాతాదారుల‌కు ఊర‌ట క‌లిగించేలా మార‌టోరియం ఆప్ష‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, అదే అప్ష‌న్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌ వినియోగ‌దారులకు షాక్ ఇవ్వ‌నుంది. అస‌లు సంగ‌తి ఏంటంటే…

క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా క్రెడిట్ కార్డ్‌, ప‌ర్స‌న‌ల్ బిల్లుల చెల్లింపుల‌కు వాయిదా కోరుతూ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్లకు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గించేస్తున్నాయ‌ట‌. కొందరి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏకంగా 80% తగ్గిపోయింద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. క‌రోనాకు ముందు రూ.2,00,000 లిమిట్ ఉంటే అది ప్ర‌స్తుతం రూ.40,000 వరకు తగ్గిపోయింది. క్రెడిట్ కార్డు బిల్లులపై మారటోరియం ఎంచుకున్నవారికి మాత్రమే కాదు… పర్సనల్ లోన్ ఈఎంఐలు వాయిదా వేసుకున్నవారి క్రెడిట్ కార్డుల లిమిట్ తగ్గింది. అంటే పర్సనల్ లోన్‌పై మారటోరియం ఎంచుకుంటే వారికి ఉన్న క్రెడిట్ కార్డుల లిమిట్ తగ్గిపోయింది. అంతేకాదు లిమిట్ ఎక్కువగా ఉన్న క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తక్కువగా వాడుతున్నా వారి లిమిట్ కూడా తగ్గిపోతుంది.

మారటోరియం ఎంచుకోవడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. క్రెడిట్ కార్డ్ బిల్లులు, పర్సనల్ లోన్ ఈఎంఐలు చెల్లించే స్తోమత ఉంటే మారటోరియం ఆప్షన్ ఎంచుకోకపోవడమే మంచిద‌ని సూచిస్తున్నారు.  మారటోరియం ఎంచుకుంటే ఈఎంఐలు వాయిదా వేయొచ్చు. కానీ వడ్డీ మాత్రం చెల్లించాల్సిందే. కాబట్టి మీరు మారటోరియం ఎంచుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి