కూరగాయలు అమ్ముకుంటున్న బాలికా వధు సీరియల్ అసిస్టెంట్
పాపిష్టి కరోనా సమస్తాన్ని నాశనం చేసి పారేసింది.. అన్ని రంగాలపైనా ఈ వైరస్ ప్రభావం పడింది.. వైరస్ వ్యాప్తి చెందకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యింది.. చిన్న చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి..
పాపిష్టి కరోనా సమస్తాన్ని నాశనం చేసి పారేసింది.. అన్ని రంగాలపైనా ఈ వైరస్ ప్రభావం పడింది.. వైరస్ వ్యాప్తి చెందకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యింది.. చిన్న చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి.. సినిమా పరిశ్రమ ఇందుకు మినహాయింపేమీ కాదు.. లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి.. సీరియల్స్, టీవీ షోల షూటింగ్‌లు కూడా బందయ్యాయి. అంతో ఇంతో వెనకేసుకున్నవారు బాగానే ఉన్నారు కానీ రోజువారీ జీతంతో జీవితాన్ని నెట్టుకొచ్చేవారే కష్టాలు పడుతున్నారు.. బాలికావధు వంటి పాపులర్ టీవీ సీరియల్‌కు డైరెక్టర్‌గా పని చేసిన రామ్ వృక్షగౌర్‌కు కూడా ఆర్ధిక సమస్యలు తప్పడం లేదు.. పొట్టకూటి కోసం కూరగాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందాయనకు! కొన్ని ఎపిసోడ్లకు దర్శకత్వం వహించిన ఆయనకు ఓ సినిమా అవకాశం కూడా వచ్చింది.. సెట్‌లోకి వెళ్లేందుకు టైముంది కదా అని సొంత ఊరు అజంఘడ్‌కు వెళ్లారు.. సరిగ్గా అప్పుడే లాక్‌డౌన్‌ను ప్రకటించింది భారత ప్రభుత్వం. వెనక్కి వచ్చే అవకాశం లేకుండాపోయిందాయనకు.. నిర్మాత కూడా ప్రాజెక్టును వాయిదా వేసుకున్నారు.. మళ్లీ షూటింగ్ మొదలు కావాలంటే ఎంత కాదన్నా ఏడాది పడుతుందని ఫోన్ రామ్ వృక్షగౌర్‌కు ఫోన్ చేసి చెప్పారట నిర్మాత.. గత్యంతరం లేక తన తండ్రి చేసే కూరగాయల వ్యాపారాన్ని ఈయనా మొదలుపెట్టారు.. తోపుడు బండిపై తిరుగుతూ కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇలా కూరగాయలు అమ్ముకుంటున్నందుకు నాకు ఎలాంటి బాధ లేదంటున్నారు రామ్ వృక్ష గౌర్.