వ‌చ్చే ఏడాది మొదట్లో క‌రోనా వ్యాక్సిన్ః హ‌ర్ష‌వ‌ర్ద‌న్

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి త్వరలో విముక్తి కలుగుతుందని కేంద్ర కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ తెలిపారు.

వ‌చ్చే ఏడాది మొదట్లో క‌రోనా వ్యాక్సిన్ః హ‌ర్ష‌వ‌ర్ద‌న్
Follow us
Balaraju Goud

| Edited By: Balu

Updated on: Sep 28, 2020 | 4:28 PM

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి త్వరలో విముక్తి కలుగుతుందని కేంద్ర కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ తెలిపారు. వ‌చ్చే ఏడాది తొలి త్రైమాసికంలో క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో జ‌రిగిన ఐసీఎంఆర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. క‌రోనా టీకా త‌యారీ కోసం దేశంలో విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్న‌ట్లు వివరించారు. ప్ర‌స్తుతం దేశంలో మూడు ర‌కాల టీకాల‌కు మాన‌వ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. కాగా, కొవిడ్‌19 వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ను కూడా ప్రారంభించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో దేశవ్యాప్తంగా ప్రస్తుతం జ‌రుగుతున్న టీకా ప్రయోగాలకు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని పొందుపర్చినట్లు మంత్రి వివరించారు. ఐసీఎంఆర్‌కు ఇవాళ చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు అని, ఐసీఎంఆర్ వందేళ్ల టైమ్‌లైన్‌ను రిలీజ్ చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. ప్రస్తుత తరుణంలో ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌ల సేవ‌లు అనిర్వ‌చ‌నీయ‌మ‌న్నారు. భావి త‌రాల శాస్త్ర‌వేత్త‌ల‌కు ఐసీఎంఆర్ ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని మంత్రి హర్షవర్ధన్ అన్నారు.