AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఎఫెక్ట్ః సొంత‌వైద్యంతో దంప‌తులు మృతి

కరోనా వైరస్‌ని అడ్డుకోవడానికి క్లోరోక్విన్ ఫాస్పేట్ చక్కగా ఉపయోగపడుతోందని ప్ర‌క‌టించారు అమెరికా అద్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్. దేశాధ్య‌క్షుడే చెప్ప‌డంతో అరిజోనాలో... ఇద్దరు దంపతులు..

క‌రోనా ఎఫెక్ట్ః సొంత‌వైద్యంతో దంప‌తులు మృతి
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2020 | 10:28 AM

Share

క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో ప్ర‌పంచ‌దేశాలు దానికి వ్యాక్సిన్ క‌నుగోనే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్ సోకిన బాధితుల‌కు ప‌లు ర‌కాల మందుల‌తో వైద్య‌చికిత్స‌లు అంద‌జేస్తున్నారు. అందులో భాగంగానే కొంద‌రికి ఎయిడ్స్ రోగుల‌కు ఇచ్చే మందులు ఇస్తున్న‌ట్లుగా కూడా ప్ర‌చారం జ‌రిగింది. మ‌రికొంద‌రికీ మ‌లేరియా నివార‌ణ‌కు వాడే క్లోరోక్విన్ మెడిసిన్ కూడా క‌రోనాను అరిక‌డుతుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక‌ ప్ర‌క‌ట‌న‌లో ఇదే అంశాన్ని వెల్ల‌డించారు. అయితే, ట్రంప్ చేసిన ఆ ప్ర‌క‌ట‌నే ఓ కుటుంబాన్ని బ‌లితీసుకుంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే…

కరోనా వైరస్‌ని అడ్డుకోవడానికి క్లోరోక్విన్ ఫాస్పేట్ చక్కగా ఉపయోగపడుతోందని ప్ర‌క‌టించారు అమెరికా అద్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్. దేశాధ్య‌క్షుడే చెప్ప‌డంతో అరిజోనాలో… ఇద్దరు దంపతులు తమకు వచ్చిన కరోనా వైరస్‌ని పోగొట్టుకునేందుకు సొంతంగా ఆ మందును వాడారు. ఫలితంగా అతను చనిపోగా… ఆమె ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. చేపల తొట్టెలను శుభ్రం చేసేందుకు వాడే మందును వాళ్లు తీసుకున్నట్లు వైద్యులు వెల్ల‌డించారు. దాదాపు 60 ఏళ్లు దాటిన ఆ దంపతులు… క్లోరోక్విన్ ఫాస్పేట్ తీసుకున్న అరగంటలో మరింత అనారోగ్యం పాలయ్యార‌ని, ఆ మందు వారిపై అత్యంత నెగెటివ్ ప్రభావం చూపింద‌ని చెప్పారు.

ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ఏది బడితే ఆ మందులు వాడేయవద్దంటున్న డాక్టర్లు… కరోనా వైరస్ లక్షణాలు ఉంటే… మరో మాట ఆలోచించకుండా… టోల్ ఫ్రీ నంబర్లకు కాల్స్ చెయ్యమంటున్నారు. లేదా దగ్గర్లోని డాక్టర్లకు కాల్ చెయ్యమంటున్నారు. అంతే తప్ప మందుల షాపుల్లో ఇష్టమొచ్చిన మందులు కొనుక్కొని వాడితే… ప్రాణాలకే ప్రమాద‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Follow Us
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?