ఏపీలో ఇంటింటికి వెళ్లి రూ. వెయ్యి అందిస్తోన్న వాలంటీర్లు

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రజలు కష్టాలు పడకుండా ఉండాలంటూ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికి వెళ్లి వెయ్యి రూపాయలు..

ఏపీలో ఇంటింటికి వెళ్లి రూ. వెయ్యి అందిస్తోన్న వాలంటీర్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 05, 2020 | 12:21 PM

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రజలు కష్టాలు పడకుండా ఉండాలంటూ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికి వెళ్లి వెయ్యి రూపాయలు అందిస్తున్నారు ఏపీ గ్రామ వాలంటీర్లు. శ్రీకాకుళం జిల్లా ఆదివాసీ గూడెంలలో కూడా నగదు పంపిణీ జరుగుతోంది. సీఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ లబ్ధిదారులు ప్రశంసిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఎలాంటి వెతలు పడకూడదని భావించిన జగన్.. తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ ఉచిత బియ్యంతో పాటు, వెయ్యి రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారు.

కాగా మరోవైపు ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిన్నటివరకూ 194 వరకూ ఉన్న కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఆదివారం 226కి చేరుకున్నాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 34 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజగా కర్నూలులో 23, చిత్తూరులో 7, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులక్రితం వరూ.. ఏపీలో 20కి మించి కరోనా కేసులు నమోదు కాలేదు. కానీ ఢిల్లీ మర్కజ్‌లో తబ్లిఘీ జమాత్ మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు మరింత విపరీతంగా పెరిగిపోతున్నాయి. అటు తెలంగాణలో కూడా 272కి చేరుకున్నాయి కరోనా కేసులు.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: భారత సైన్యం భారీ ఆపరేషన్.. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతం

ఈరోజే ‘మోదీ దీపావళి’.. సిద్ధమవుతోన్న భారతీయులు

కింగ్ కోఠి కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసమట.. అధికారులు ఏం చేశారంటే

మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు

డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్

నల్లా నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని తేల్చిచెప్పిన WHO

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి