మహారాష్ట్ర ఉల్లితో మలక్ పేట్ మార్కెట్‌లో కష్టాలు
మహారాష్ట్ర ఉల్లితో మలక్ పేట్ మార్కెట్‌లో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. గత కొద్దిరోజులుగా.. మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి దిగుమతి అవుతోంది. గతంలో కంటే ఈ సారి ఎక్కువగా ఉల్లి మలక్ పేట్ మార్కెట్‌కు చేరుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు..
మహారాష్ట్ర ఉల్లితో మలక్ పేట్ మార్కెట్‌లో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. గత కొద్దిరోజులుగా.. మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి దిగుమతి అవుతోంది. గతంలో కంటే ఈ సారి ఎక్కువగా ఉల్లి మలక్ పేట్ మార్కెట్‌కు చేరుతోంది. దీంతొ.. మలక్ పేట్ హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులు కరోనా సోకే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతోన్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే లారీ డ్రైవర్లకు కరోనా స్క్రీనింగ్ ఉండాలని మార్కెట్‌లోని వ్యాపారులు కోరుతున్నారు. ఎందుకంటే వారి నుంచి సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే లాక్‌డౌన్ కారణంగా అమాళిలు దొరకక .. వచ్చిన లోడ్లు అమ్ముకోలేక తలపట్టుకుంటున్నాయి మార్కెట్ కమిటీలు. అలాగే సోషల్ డిస్టెన్స్‌ను అమలు చేయలేక షాపులు మూసుకోవలసి వచ్చేలా ఉందని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు.
కాగా.. దేశ వ్యాప్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో 424 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 24 మంది మరణించారు. అలాగే 42 మంది రికవరీ అయ్యారు. ఇక ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. శనివారం రిలీజ్ చేసిన కరోనా బులిటెన్ ప్రకారంగా 272 కరోనా కేసులు నమోదు కాగా.. 11 మంది మృతి చెందారు.
ఇవి కూడా చదవండి:
ఏపీలో ఇంటింటికి వెళ్లి రూ. వెయ్యి అందిస్తోన్న వాలంటీర్లు
బ్రేకింగ్: భారత సైన్యం భారీ ఆపరేషన్.. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతం
ఈరోజే ‘మోదీ దీపావళి’.. సిద్ధమవుతోన్న భారతీయులు
కింగ్ కోఠి కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసమట.. అధికారులు ఏం చేశారంటే
మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు
డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పిన మెగాస్టార్