షాకింగ్ న్యూస్.. కరోనా మళ్లీ మళ్లీ సోకే అవకాశం
కరోనాపై పోరాటంలో శరీరంలోని యాంటీబాడీలు కీలకంగా పని చేస్తున్నాయి. అయితే ఇవి కొన్ని నెలల్లోనే తగ్గిపోతున్నట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

కరోనాపై పోరాటంలో శరీరంలోని యాంటీబాడీలు కీలకంగా పని చేస్తున్నాయి. అయితే ఇవి కొన్ని నెలల్లోనే తగ్గిపోతున్నట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో సాధారణ జలుబులాగానే కరోనా కూడా మళ్లీ మళ్లీ సోకే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ”శరీరంలో వైరస్‌కి ధీటైన యాంటీబాడీలు తయారవుతున్నాయి. అయితే కొంత కాలానికే అవి తగ్గిపోతున్నాయి” అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కేటీ డూరెస్ తెలిపారు. కరోనా సోకిన 65 మందిపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.
”కరోనాపై పోరాటంలో వ్యాధి నిరోధక శక్తి చాలా కీలకం. కానీ యాంటీబాడీలు వైరస్‌తో పోరాటం చేస్తాయి. అయితే యాంటీబాడీలు మూడు నెలల్లోనే తగ్గిపోతున్నాయంటే వ్యాక్సిన్లు కూడా అంతే అనుకోవచ్చు. ఒకసారి వ్యాక్సిన్ వేస్తే సరిపోదు. మళ్లీ వేయాల్సిన అవసరం ఉండొచ్చు” అని కేటీ అన్నారు. అయితే ”ఎక్కువ మందికి కరోనా సోకితే సామూహిక నిరోధక వస్తుందని చాలా మంది యువత కరోనాను అంటించుకుంటున్నారు. దీని వలన వారు మాత్రమే కాదు.. ఇతరులనూ ప్రమాదంలో పడేస్తారు” అని హెచ్చరించారు.



