కరోనా వ్యాప్తికి ‘సంపర్క్‌’తో కట్టడి.. తెలంగాణ ఐటీ సెల్ విజయం

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ( DRDO) రంగంలోకి దిగింది. 'సంపర్క్‌' యాప్‌ను రెడీ చేసింది. ఈ యాప్‌ను కొవిడ్ బాధితుడి ఫోన్‌లో డౌన్ లోడ్ చేస్తే సరిపోతుంది...

కరోనా వ్యాప్తికి 'సంపర్క్‌'తో కట్టడి.. తెలంగాణ ఐటీ సెల్ విజయం
Follow us

|

Updated on: Jul 14, 2020 | 10:04 AM

DRDO-TITA pact for COVID Patient Tracking app : కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో అందిరిలోనూ అందోళన మొదలైంది. కొందరి నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి కారణంగా మారుతోంది. అయితే హోం క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌లో ఉండాల్సిన కొందరు యథేచ్ఛగా తిరుగుతుండటంతో కరోనా వేంగంగా వ్యాపిస్తోంది.

ఇలాంటి స్లీపర్ కరోనా సెల్స్‌కు అడ్డుకట్ట వేయడం పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి పెద్ద సవాలుగా మారుతోంది. కొంత ‘ఆరోగ్య సేతు’తో అడ్డుకట్ట వేయగలుగుతున్నా.. అంతగా ఫలితం ఉడటం లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ( DRDO) రంగంలోకి దిగింది. ‘సంపర్క్‌’ యాప్‌ను రెడీ చేసింది. ఈ యాప్‌ను కొవిడ్ బాధితుడి ఫోన్‌లో డౌన్ లోడ్ చేస్తే సరిపోతుంది. దీని ద్వారా హోం క్వారంటైన్‌, ఐసొలేషన్‌లో ఉన్న బాధితులను నిరంతరం పర్యవేక్షించవచ్చు. వారి కదలికలను గమనించవచ్చు.

హోం క్వారంటైన్‌ , ఐసొలేషన్‌లో ఉన్న వారి కదిలికలపై ‘సంపర్క్‌’ యాప్ నిఘా పెడుతుంది. వారి ప్రతీ కదలికను రికార్డ్ చేస్తుంది. వెంటనే ఆ వివరాలను పోలీస్‌, వైద్యారోగ్య విభాగాలు చేరవేస్తుంది.

కరోనా బాధితుడు జియోఫెన్సింగ్‌ ఏరియాను వరుసగా నాలుగుసార్లు ఉల్లంఘించిస్తే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా హెచ్చరిక సందేశం పంపిస్తుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో సమర్పించిన సెల్ఫీకి, అనంతరం ఇచ్చిన సెల్ఫీకి మధ్య పొంతన లేకపోయినా యాప్‌ అలర్ట్‌ చేస్తుంది. క్వారంటైన్‌ గడువు ముగిసిన అనంతరం బాధితుడు ఈ నిఘా నుంచి ఫ్రీ అవుతాడు. తర్వాత యాప్‌ను తొలగించుకోవచ్చు.. ఇది ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుందో చూడాలి.