ఏపీ కరోనా అప్‌డేట్స్: 100 దాటిన కరోనా మరణాలు

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది . గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 491 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీ కరోనా అప్‌డేట్స్: 100 దాటిన కరోనా మరణాలు
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 6:27 PM

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది . గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 491 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో  రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,452కు చేరింది.  ఇందులో రాష్ట్రంలో కొత్తగా 390 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 83 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో ఐదు మరణాలు సంభవించాయి. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 101కి చేరింది. అలాగే 4,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో తాజాగా 22,371 పరీక్షలు నిర్వహించగా.. అందులో 390 కొత్త కేసులు వచ్చాయి. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6630కు చేరింది.  వారిలో తాజాగా 138 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం డిశ్చార్జి సంఖ్య 3,203కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 3,316 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 18 మందికి కరోనా సోకగా.. వారికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 326కు చేరింది. అందులో 277 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 83 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1506కు చేరింది. వీరిలో 859 డిశ్చార్జి అవ్వగా.. 647 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

Read This Story Also:  Breaking: ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. వారి డబ్బు వాపస్