అలంపూర్ ఆలయాల మూసివేత!
మహబూబ్ నగర్ జిల్లాలోని బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను ఈనెల 13 నుంచి 19 వరకు మూసివేస్తున్నట్లు ఆలయాల కార్యనిర్వహణాధికారి ప్రేమ్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను ఈనెల 13 నుంచి 19 వరకు మూసివేస్తున్నట్లు ఆలయాల కార్యనిర్వహణాధికారి ప్రేమ్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అలంపూర్‌లో దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటే..కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని వారు అభిప్రాయపడుతున్నారు. వైరస్ కట్టడి కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల సమయంలో ఆలయాల్లో అర్చకులు నిత్యపూజలు నిర్వహించి గుడి మూసివేస్తారని చెప్పారు. ఉభయ ఆలయాల దర్శనాలకు భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించి 13 నుంచి 19వ తేదీ వరకు దర్శనాలకు రాకుండా విరమించుకోవాలని ఆలయ ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ప్రతీ సంవత్సరం అలంపూర్ మహాద్వారం వద్ద అలీ పహిల్వాన్ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. గంధం ఉత్సవంతో ఈ ఉర్సు మొదలవుతుంది. ముందు రోజున గంధాన్ని కర్ణాటక జిల్లా గుల్బర్గా నుంచి అలంపూర్‌కు తీసుకువస్తారు. అలంపూర్ పాత తహీసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా మొదట చిన్న కిస్తీ వద్దకు వెళతారు. చిన్నకిస్తీని తీసుకుని బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలోని వెనుకభాగంలో ఉన్న పెద్ద కిస్తీ దర్గా వద్దకు వస్తారు. రెండు చోట్ల పూజలు నిర్వహిస్తారు. ఈ ఉర్సు కార్యక్రమానికి రాయిచూరు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, తదితర ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు.