కరోనా ఎఫెక్ట్: ఆ రంగంలో 3.8కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం..!
కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించగా.. చాలా రంగాలపై ఆ ప్రభావం పడింది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో పర్యాటక రంగానికి గడ్డుకాలం దాపురించిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించగా.. చాలా రంగాలపై ఆ ప్రభావం పడింది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో పర్యాటక రంగానికి గడ్డుకాలం దాపురించిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. ఇక తాజా సమాచారం ప్రకారం లాక్‌డౌన్ తరువాత పర్యాటక రంగం, దాని అనుబంధ ఆతిథ్య రంగాల్లో 3.8కోట్ల మంది శ్రామికులు ఉపాధిని కోల్పోనున్నారని ప్రముఖ సంస్థ కేపీఎంజీ(ఆర్థిక సర్వీసులు, వ్యాపార సలహా సంస్థ) ఓ నివేదికలో వెల్లడించింది.
పర్యాటక రంగంతో పాటు దానికి అనుబంధంగా పేర్కొనే కార్పొరేట్ సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు నిలిచిపోవడం వల్ల భారీ నష్టం వాటిల్లనుందని ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఓ సర్వీసెస్ అధిపతి ఉన్మేష్ వైద్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు లాక్‌డౌన్ కొనసాగించడం వల్ల పర్యాటక, ప్రయాణ రంగాలు తీవ్రంగా దెబ్బ తింటాయని.. ఈ రంగాలు పూర్తిగా కోలుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో కూడా చెప్పలేమని పలు ట్రావెల్ సంస్థలు వాపోతున్నాయి.
Read This Story Also: ఆ లేఖపై విచారణ జరిపించండి.. డీజీపీకి విజయసాయి రెడ్డి లేఖ..!