Andhra Pradesh: పోలీస్ స్టేషన్ల మధ్య డెడ్‌బాడీ పంచాయతీ.. సర్వేయర్ వస్తే కానీ చిక్కుముడి వీడలేదు!
డెడ్ బాడీ తల కొత్త చెరువు మండలం లోచర్ల గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుందని.. కాళ్లు మాత్రమే పుట్టపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని.. కాదు కాదు ఆ డెడ్ బాడీ పుట్టపర్తి పోలీసులే తరలించాలి అది పుట్టపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుందంటూ కొత్తచెరువు పోలీసులు వాదించుకున్నారు.

అందరి సమస్యలు తీర్చే పోలీసులకే పెద్ద చిక్కు వచ్చి పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్ళకుంట క్రాస్ వద్ద రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహం పడి ఉంది. రోడ్డు పక్కన ఓ వ్యక్తి డెడ్ బాడీ ఉందని స్థానికులు పుట్టపర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే డెడ్ బాడీ తల కొత్త చెరువు మండలం లోచర్ల గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుందని.. కాళ్లు మాత్రమే పుట్టపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని.. కాదు కాదు ఆ డెడ్ బాడీ పుట్టపర్తి పోలీసులే తరలించాలి అది పుట్టపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుందంటూ కొత్తచెరువు పోలీసులు వాదించుకున్నారు.
డెడ్ బాడీ తరలింపులో పుట్టపర్తి, కొత్తచెరువు పోలీసులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. అలా సంఘటనా స్థలానికి పుట్టపర్తి కొత్తచెరువు పోలీసులు వచ్చి చూసి.. తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి రాదంటూ డెడ్ బాడీ తరలించకుండా అలాగే ఉండిపోయారు. గ్రామ పెద్దలు వచ్చి చెప్పినా పోలీసులు వినకపోవడంతో.. చివరకు రెవెన్యూ సర్వేర్ వచ్చి కొలతలు వేసి డెడ్ బాడీ తల కొత్తచెరువు మండలం లోచర్ల పంచాయతీ పరిధిలోకి వస్తుందని.. దీంతో ఆ గుర్తుతెలియని మృతదేహాన్ని కొత్తచెరువు పోలీసులే తరలించాలని రెవెన్యూ సర్వేయర్ తేల్చాడు.
అలా డెడ్ బాడీ తరలించడానికి సర్వేయర్ వచ్చి కొలతలు వేయాల్సిన విచిత్ర పరిస్థితి వచ్చింది. సర్వేయర్ కొలతలు వేసి డెడ్ బాడీ కొత్తచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అని చెప్పడంతో.. ఆఖరికి కొత్తచెరువు పోలీసులే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీంతో రెండు పోలీస్ స్టేషన్ల మధ్య నెలకొన్న సరిహద్దు పంచాయతీ.. రెవెన్యూ సర్వేయర్ వచ్చి తేల్చాల్సి వచ్చింది. ఇక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..