రాత్రిపూట జుట్టుకు నూనె పెడుతున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి.
కాబట్టి జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుందని అంటున్నారు.. ఆ జిడ్డు ముఖానికి కూడా అంటుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువ అయిపోతాయి. అలాగే, మసాజ్ ఎక్కువ సేపు చేయడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి. ఎక్కువసేపు కురులను తాకడం వల్ల రాలిపోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

కొంతమంది జుట్టుకు రాత్రిపూట నూనె రాసుకుని మరుసటి రోజు ఉదయం తల స్నానం చేస్తుంటారు. ఇలా చేయటం ఎంతవరకు సరైనదో ఎప్పుడైనా ఆలోచించారా..? ఎంత ఎక్కువ సేపు నూనెతో ఉంటే జుట్టుకు అన్ని పోషకాలు అందుతాయనుకుంటారు. కానీ ఎక్కువ సమయం జుట్టుకు నూనె ఉంచడం వల్ల మురికి పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టుకు నూనె పెట్టిన రెండు గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టుకు నూనె పెట్టకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య రెట్టింపవుతుందని అంటున్నారు. జుట్టు రాలుతుందంటే ఎక్కువ మొత్తంలో నూనె రాస్తుంటారు. కానీ, జుట్టు రాలడానికి కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులు, సరైన పోషకాలు అందకపోవడం అని తెలుసుకోవాలి. జుట్టు పొడిగా మారినప్పుడు మాత్రమే నూనె రాస్తే మంచిది. అలాగే, హాయిగా ఉంది కదా అని నూనె రాసుకున్నప్పుడల్లా గంట కొద్ది మసాజ్ చేయించుంటారు. ఇది కూడా సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు..రాత్రిపూట జుట్టుకు బాగా పెట్టుకుని పడుకోవడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవడం వల్ల మొటిమలు వచ్చే అవకావం ఉందని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుందని అంటున్నారు.. ఆ జిడ్డు ముఖానికి కూడా అంటుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువ అయిపోతాయి. అలాగే, మసాజ్ ఎక్కువ సేపు చేయడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి. ఎక్కువసేపు కురులను తాకడం వల్ల రాలిపోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..