శానిటైజర్ చల్లిన చింపాంజీ.. థాయిలాండ్ జూలో వింత !

థాయిలాండ్ జూలో నిర్వాహకులు ఓ చింపాంజీ చేత శానిటైజర్ చెల్లించారు. దానికి ఫేస్ మాస్క్ కట్టి.. చిన్న సైకిల్ వెనుక శానిటైజర్ మెషిన్ బిగించారు.  అది పిల్లలు తొక్కే చిన్న సైకిల్ తొక్కుతుండగా వెనుకే ఓ వర్కర్ దాని వెంట చిన్నగా పరుగులు తీస్తూ..

  • Umakanth Rao
  • Publish Date - 5:20 pm, Wed, 15 April 20
శానిటైజర్ చల్లిన చింపాంజీ.. థాయిలాండ్ జూలో వింత !

థాయిలాండ్ జూలో నిర్వాహకులు ఓ చింపాంజీ చేత శానిటైజర్ చెల్లించారు. దానికి ఫేస్ మాస్క్ కట్టి.. చిన్న సైకిల్ వెనుక శానిటైజర్ మెషిన్ బిగించారు.  అది పిల్లలు తొక్కే చిన్న సైకిల్ తొక్కుతుండగా వెనుకే ఓ వర్కర్ దాని వెంట చిన్నగా పరుగులు తీస్తూ.. జూ అంతా శానిటైజ్ చేశాడు. ఇది చూడ్డానికి తమాషాగా, బాగానే ఉన్నప్పటికీ.. కరోనా వ్యాప్తి నివారణకు నోరు లేని మూగజీవాలను ఇలా వినియోగించుకుంటారా అని పెటా వంటి జంతు పరిరక్షణ సంస్థలు మండిపడ్డాయి. అసలే ఈ జీవులను ఊపిరి ఆడని ఇరుకైన బోన్లలో బంధించి ఉంచుతారని, వాటిని దారుణంగా హిషిస్తున్నారని ఈ సంస్థల  నిర్వాహకులు దుయ్యబట్టారు. ఈ చిన్న వయసున్న చింపాంజీని ఇలా వినియోగించుకోవడం క్రూరంకాదా అని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను ఎత్తివేశాక తమ జంతు ప్రదర్శన శాలను మళ్ళీ ప్రారంభిస్తామని, ఇన్నాళ్ళూ జూను మూసివేసినందున దీన్ని క్లీన్ చేసేందుకు ఈ చింపాంజీని వినియోగించుకున్నామని జూ డైరెక్టర్ చెప్పారు. పైగా ఈ జీవికి మంచి శిక్షణ ఇఛ్చామని, వారానికి రెండు మూడు సార్లు దీన్ని ఇలా జూను శానిటైజ్ చేసేందుకు ఉపయోగించుకుంటామని ఆయన అన్నారు. ఇది తెరిచిన అనంతరం ఈ చింపాంజీని మళ్ళీ దాని ఎన్ క్లోజర్ లో వదిలేస్తామన్నారు.