రఫేల్ యుద్ధవిమానల రాకకు.. లాక్‌డౌన్ బ్రేకులు..
రఫేల్ యుద్ధ విమానాల రాక కోసం.. ఎప్పటి నుంచో వేచిచూస్తున్న విషయం తెలిసిందే. తొలుత కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. ఈ ఏడాది మే నెల చివరినాటికి రావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ యుద్ధ విమానాల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానుందని భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాతే.. రఫేల్ యుద్ధ విమానాల రాకకు సంబంధించిన తేదీలపై స్పష్టత వస్తుందని… అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఈ రఫేల్ జెట్ […]

రఫేల్ యుద్ధ విమానాల రాక కోసం.. ఎప్పటి నుంచో వేచిచూస్తున్న విషయం తెలిసిందే. తొలుత కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. ఈ ఏడాది మే నెల చివరినాటికి రావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ యుద్ధ విమానాల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానుందని భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాతే.. రఫేల్ యుద్ధ విమానాల రాకకు సంబంధించిన తేదీలపై స్పష్టత వస్తుందని… అధికారులు తెలిపారు.
ఫ్రాన్స్‌కు చెందిన ఈ రఫేల్ జెట్ యుద్ధ విమానాలు.. అత్యాధునిక టెక్నాలజీ కలిగినవి. ఈ యుద్ధ విమానాలు రాడర్‌లను కూడా తప్పించుకుని.. అత్యంత వేగంగా దూసుకెళ్లగలవు. అయితే ఈ యుద్ధ విమానాలకు సంబంధించి..డస్సల్ట్ ఏవియేషన్ సంస్థ.. భారత పైలట్లకు శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన నలుగురు పైలట్లు.. ఈ రఫేల్ యుద్ధ విమానాలను నడుపుతున్నారని.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ రతెలిపారు.
కాగా.. ఈ రఫేల్ జెట్ విమానాల ఒప్పందం 2016లో జరిగింది. మొత్తం 36 రఫేల్ జెట్ ఫైటర్ విమానాల కోసం.. రూ.60వేల కోట్ల ఒప్పందాన్ని.. ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎన్నో దశాబ్ధాలుగా.. ఫ్రాన్స్, భారత్‌ల మధ్య ఫైటర్ జెట్ విమానాలకు సంబంధించి డీల్ జరుగుతూనే ఉంది.