RR vs CSK, IPL 2025: టాస్ గెలిచిన చెన్నై.. రాజస్థాన్ రాత మారేనా?
Rajasthan Royals vs Chennai Super Kings, 11th Match: ఐపీఎల్‌లో నేడు రెండో మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 2 మార్పులతో బరిలోకి దిగింది. జేమీ ఓవర్టన్, విజయ్ శంకర్‌లకు ప్లేయింగ్-11లో అవకాశం లభించింది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది.

Rajasthan Royals vs Chennai Super Kings, 11th Match: ఐపీఎల్‌లో నేడు రెండో మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 2 మార్పులతో బరిలోకి దిగింది. జేమీ ఓవర్టన్, విజయ్ శంకర్‌లకు ప్లేయింగ్-11లో ఛాన్స్ దక్కింది. కాగా, ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది.
ఈ సీజన్‌లో తొలి విజయం కోసం రాజస్థాన్ ఎదురుచూస్తోంది. హైదరాబాద్, కోల్‌కతా జట్లతో జరిగిన మొదటి 2 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ జట్టు ఓటమిని ఎదుర్కొంది. మరోవైపు, గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిపోయిన చెన్నై.. తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన సంగతి తెలిసిందే.
🚨 Toss 🚨@ChennaiIPL won the toss and elected to bowl against @rajasthanroyals
Updates ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK pic.twitter.com/HFXVecPbCg
— IndianPremierLeague (@IPL) March 30, 2025
ఇరు జట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్), జామీ ఓవర్టన్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: కునాల్ సింగ్ రాథోడ్, శుభమ్ దూబే, ఫజల్‌హాక్ ఫరూకీ, కుమార్ కార్తికేయ, యుధ్వీర్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: శివం దుబే, ముఖేష్ చౌదరి, డెవాన్ కాన్వే, షేక్ రషీద్, సామ్ కుర్రాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..