AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lic Agent: ఈ ఉద్యోగంలో మీకు మీరే బాస్.. ఖాళీ సమయంలో చేసుకోవచ్చు.. మంచి ఆదాయం..

ఈ సంస్థలో ఏజెంట్ గా చేరి బీమా పాలసీలను విక్రయించడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు. అలాగే అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏజెంట్ గా పనిచేయాలనుకుంటే అంకితభావం చాలా అవసరం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఖాతాదారుల బీమా అవసరాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. బీమా పాలసీలు చేయడంలో మీ చొరవ, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఆదాయం లభిస్తుంది.

Lic Agent: ఈ ఉద్యోగంలో మీకు మీరే బాస్.. ఖాళీ సమయంలో చేసుకోవచ్చు.. మంచి ఆదాయం..
Lic
Madhu
|

Updated on: Apr 27, 2024 | 5:14 PM

Share

సాధారణంగా ఉద్యోగం అంటే నిర్ణీత పనిగంటలు ఉంటాయి. సమయానికి ఆఫీసు కు వెళ్లడం డ్యూటీ అయ్యాక తిరిగి రావడం, తర్వాత రోజు ఉదయాన్నే మళ్లీ వెళ్లడం మామూలే. ఇలా రొటీన్ జీవితంతో విసుగుపుడుతుంది. టైమ్ నిబంధనలు లేకుండా మనకు వీలు ఉన్నప్పుడు పని చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందని చాలా మంది కోరుకుంటారు. మీకు మీరే బాస్ గా ఉండే ఉద్యోగాలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా బీమా రంగంలో ఈ అవకాశం ఉంది. దేశంలో ప్రముఖ సంస్థ అయిన ఎల్ ఐసీలో ఏజెంట్ చేసి, బీమా పాలసీలకు విక్రయించవచ్చు. మీకు వీలున్న సమయంలో పనిచేసుకుంటూ ఆదాయం పొందవచ్చు.

ఎల్ఐసీ..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్య బీమా సంస్థ. దీని ద్వారా ప్రజలకు బీమా సేవలు అందుతున్నాయి. వ్యక్తిగతంగా, గ్రూపులకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తుంది. ముఖ్యంగా బీమా రంగంలో ఎల్ ఐసీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక వేల మంది ఏజెంట్లు, అనేక చోట్ల కార్యాలయాలు ఉన్నాయి.

మంచి ఆదాయం..

ఈ సంస్థలో ఏజెంట్ గా చేరి బీమా పాలసీలను విక్రయించడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు. అలాగే అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏజెంట్ గా పనిచేయాలనుకుంటే అంకితభావం చాలా అవసరం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఖాతాదారుల బీమా అవసరాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. బీమా పాలసీలు చేయడంలో మీ చొరవ, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఆదాయం లభిస్తుంది. కాబట్టి ఇందులో చేరానుకునేవారు తమ నైపుణ్యాన్ని ముందు గమనించుకోవాలి.

ప్రయోజనాలు ఇవే..

ఎల్ ఐసీ ఏజెంట్ కు నిర్థిష్ట పని గంటలు అంటూ ఏమీ ఉండవు. తమ సౌలభ్యాన్ని బట్టి పని చేసుకోవచ్చు. ఇంట్లో వివిధ బాధ్యతలు ఉన్న వారికి ఈ పని వీలుగా ఉంటుంది. ఖాళీ సమయంలో స్వతంత్రంగా పనిచేసుకునే అవకాశం లభిస్తుంది. ఖాతాదారులకు సరిపడే బీమా పాలసీని వారికి అందించడం చాలా ముఖ్యం. అది మీ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఖాతాదారులతో దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడం కూడా చాలా అవసరం

ఎల్‌ఐసీ ఏజెంట్ కావాలంటే..

అర్హత: కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు, కానీ కనీస వయస్సు 18 సంవత్సరాలు.

రిజిస్ట్రేషన్: సమీపంలోని ఎల్ ఐసీ కార్యాలయాన్ని సంప్రదించాలి. ప్రాథమిక పత్రాలతో అభివృద్ధి అధికారి (డీవో)ని కలవాలి. వారు దరఖాస్తు ప్రక్రియ ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తారు. నమోదు రుసుము ఉండవచ్చు.

శిక్షణ: మీరు ఆన్‌లైన్‌లో లేదా తరగతిలో ఎల్ ఐసీ అందించే 25 గంటల తప్పనిసరి శిక్షణను పూర్తి చేయాలి. ఎల్‌ఐసీ పాలసీలు, బీమా పరిశ్రమపై మీకు అవగాహన పెరుగుతుంది.

పరీక్ష: బీమా నిబంధనలు, ఎల్ ఐసీ పాలసీలపై మీ అవగాహనను పరీక్షించడానికి ఐఆర్డీఏ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

లైసెన్స్: పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, మీరు మీ ఎల్ ఐసీ ఏజెంట్ లైసెన్స్‌ అందుకుంటారు. దీంతో బీమా పాలసీలను అధికారికంగా విక్రయించవచ్చు.

ఎల్ ఐసీ ఏజెంట్లు బీమా పరిశ్రమ, ఉత్పత్తులు, నిబంధనలలో వస్తున్న మార్పులను ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలి. నిరంతర అభ్యాసం, నైపుణ్యం అభివృద్ధి మీకు విజయం సాధించడంలో సహాయపడతాయి. మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..