10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్ విడుదలకు సర్వం సిద్ధం.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..

తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సర్వం సిద్దం చేశారు అధికారులు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఇప్పటికే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రిజల్స్ విడుదల చేశారు అధికారులు.

10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్ విడుదలకు సర్వం సిద్ధం.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..
TS 10th Class Result 2024 Date
Follow us
Srikar T

|

Updated on: Apr 27, 2024 | 7:55 PM

తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సర్వం సిద్దం చేశారు అధికారులు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఇప్పటికే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రిజల్స్ విడుదల చేశారు అధికారులు. అయితే తెలంగాణలోనూ పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు సిద్దమైంది తెలంగాణ విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో ఎగ్జాన్స్ నిర్వహించింది విద్యాశాఖ. అక్కడక్కడా కొన్ని మాల్‌ ప్రాక్టీసింగ్ సంఘటనలు చవిచూసినటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా సజావుగా పరీక్షలను నిర్వహించారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన మరుక్షణంలో అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

2024 టెన్త్ క్లాస్ రిజల్స్‎ను www.tv9telugu.com లో కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫలితాల డీకోడింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తైంది కావున ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించేందుకు రంగం సిద్దం చేసింది విద్యా శాఖ. గతంలో ఇంటర్‌ ఫలితాల విడుదలకు అనుమతి కోరుతూ ఎన్నికల అధికారులను ఇంటర్ బోర్డు లేఖరాసింది. ఇదే క్రమంలో పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి విద్యాశాఖ లేఖ రాసింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. అందుకే ఆయా శాఖల మంత్రుల చేతుల మీదుగా పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డు వస్తుంది. కావున విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!