UPSC NDA 2 2025 Notification: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
యేటా రెండు సార్లు యూపీఎస్సీ భర్తీ చేసే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) ఖాళీల భర్తీకి 2025 సంవత్సరానికి రెండో విడత నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ప్రవేశం లభిస్తే దేశ త్రివిధ దళాల విభాగాల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. ఎంపికైన వారు వచ్చే ఏడాది (2026) జులై 1 నుంచి ప్రారంభమయ్యే..

దేశ రక్షణ దళంలో చేరి, దేశానికి సేవ చేయాలని ఉవ్విళ్లూరే యువతకు చక్కటి అవకాశం వచ్చింది. యేటా రెండు సార్లు యూపీఎస్సీ భర్తీ చేసే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) ఖాళీల భర్తీకి 2025 సంవత్సరానికి రెండో విడత నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ప్రవేశం లభిస్తే దేశ త్రివిధ దళాల విభాగాల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. ఎంపికైన వారు వచ్చే ఏడాది (2026) జులై 1 నుంచి ప్రారంభమయ్యే నేషనల్ డిఫెన్స్ అకాడమీ 156వ కోర్సులో, 118వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్సిస్తారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు జూన్ 17, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (2)-2025 నోటిఫికేషన్ కింద మొత్తం 406 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుంచి 370 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఆర్మీ వింగ్ నుంచి 208, నేవీ వింగ్‌లో 42, ఎయిర్ ఫోర్స్ వింగ్‌లో 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే ఫ్లయింగ్ వింగ్‌లో 92, గ్రౌండ్ డ్యూటీలు (టెక్) వింగ్‌లో 18, గ్రౌండ్ డ్యూటీలు (నాన్-టెక్) వింగ్‌లో 10 పోస్టులను భర్తీ చేస్తారు. ఇక నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) వింగ్‌లో 36 పోస్టులు ఉండగా.. వీటిలో మహిళలకు 4 పోస్టులు కేటాయించారు.
ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గ్రూపులో ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) పోస్టులకైతే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు కూడా అర్హులే. అభ్యర్థుల 1 జనవరి, 2007కి ముందు, 1 జనవరి, 2010కి తర్వాత పుట్టి ఉండకూడదు. ఈ అర్హతలున్నవారు జూన్ 16, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష సెప్టెంబర్14, 2025 నిర్వహిస్తారు.
ఎంపిక విధానం ఇలా..
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో రెండు పేపర్లకు మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేవర్-1 మ్యాథమేటిక్స్- 300 మార్కులు, పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంపికైన వారిని నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి డిఫెన్స్, నేవల్‌లో ఉద్యోగాలు కల్పిస్తారు.
యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2) 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








