UPSC Admit Card 2021: ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్.. అడ్మిట్ కార్డ్ విడుదల చేసిన యూపీఎస్సీ..
UPSC Admit Card 2021: ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్మిట్ కార్డును జారీ చేసింది.
UPSC Admit Card 2021: ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్మిట్ కార్డును జారీ చేసింది. మెయిన్స్ పరీక్ష (UPSC ఇంజనీరింగ్ సర్వీస్ మెయిన్స్ పరీక్ష) కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్ (UPSC అడ్మిట్ కార్డ్ 2021) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 215 పోస్టులను భర్తీకై యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇంజనీర్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ 7 ఏప్రిల్ 2021 నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి 27 ఏప్రిల్ 2021 వరకు సమయం ఇచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష 18 జూలై 2021న నిర్వహించగా.. దీని అడ్మిట్ కార్డ్‌లు 24 జూన్ 2021న జారీ చేశారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు 6 ఏప్రిల్ 2021న ప్రకటించారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరుకావచ్చు. మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని యూపీఎస్సీ సూచించింది.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా?.. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇవ్వబడిన What’s New లింక్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఇంజినీరింగ్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్, 2021 సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్, లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.. దానిని డౌన్‌లోడ్ చేసి, తదుపరి ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఖాళీల వివరాలు.. యూపీఎస్సీవిడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 215 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేస్తారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ ద్వారా మీరు ఖాళీకి సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చు.
మెయిన్స్ పరీక్ష సెంటర్స్.. అహ్మదాబాద్, ఐజ్వాల్, అలహాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, డిస్పూర్, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, త్రివేండ్రం, విశాఖపట్నంలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
Also read:
Huzurabad Bypoll: మావోయిస్టులు చెప్పిన ఆ మాట నిజమే.. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్..
YouTube: కొత్త ఫ్యూచర్ వచ్చిందోచ్.. అదే ‘న్యూ టు యు ఫీచర్’.. దీంతో వెతకడం చాలా ఈజీ..