YouTube: కొత్త ఫ్యూచర్ వచ్చిందోచ్.. అదే ‘న్యూ టు యు ఫీచర్’.. దీంతో వెతకడం చాలా ఈజీ..

YouTube మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తన ప్లాట్‌ఫారమ్‌లో సరికొత్త ఫీచర్ 'న్యూ టు యు' ట్యాబ్‌ను విడుదల చేసింది. ఇది హోమ్ ఫీడ్‌లో కనిపించే..

YouTube: కొత్త ఫ్యూచర్ వచ్చిందోచ్.. అదే 'న్యూ టు యు ఫీచర్'.. దీంతో వెతకడం చాలా ఈజీ..
New To You
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 28, 2021 | 10:39 PM

YouTube మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తన ప్లాట్‌ఫారమ్‌లో సరికొత్త ఫీచర్ ‘న్యూ టు యు’ ట్యాబ్‌ను విడుదల చేసింది. ఇది హోమ్ ఫీడ్‌లో కనిపించే సాధారణ సిఫార్సులో భాగం కాని కంటెంట్‌ను కనుగొనడానికి తన యూజర్లకు అనుమతించింది. కొత్త ట్యాబ్ మొబైల్, డెస్క్‌టాప్, టీవీలో YouTube హోమ్‌పేజీలో కనిపిస్తుంది. ఈ వివరాలను యూట్యూబ్ తాజా ప్రకటనలో వెల్లడించింది. ఇది న్యూ యూట్యూబ్ క్రియేటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. సాధారణంగా నోటిఫికేషన్ చేయబడిన వీడియో వెలుపల కంటెంట్‌ను రిఫ్రెష్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఈ ఫీచర్ క్రియేటర్లకు తమ కంటెంట్‌పై ఎక్కువ ఆసక్తి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయడం ద్వారా కొత్త వీవర్స్‌ను చేరుకోవడంలో సహాయపడుతుంది.

ఈరోజే మీకు కొత్తగా ప్రయత్నించండి..మీ టాపిక్ బార్‌లో న్యూ టు యుపై  క్లిక్ చేయండి అని కంపెనీ తెలిపింది. YouTube హోమ్‌పేజీని (మొబైల్‌లో) రిఫ్రెష్ చేసిన తర్వాత కూడా దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది వ్యక్తిగతీకరించబడినందున ఈ ఫీచర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని చూడటానికి మీరు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 15వ తేదీ నుండి వారం రోజుల పాటు లైవ్ షాపింగ్ ఈవెంట్, YouTube హాలిడే స్ట్రీమ్ & షాప్‌ని హోస్ట్ చేస్తున్నట్లు YouTube ఇటీవల ప్రకటించింది.

నవంబర్ 1 నుంచి Samsung, Apple సహా ఈ స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp పనిచేయదు

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లు ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు అంత క్రేజ్‌ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలుసార్లు వాట్సాప్‌ కొత్త అప్‌డేట్స్‌ తీసుకొస్తోంది. అయితే ఏ యాప్‌ అయినా సరే ఫోన్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో భాగంగానే వాట్సాప్‌ కొత్త అప్‌డేట్స్‌ను కొన్ని పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో తమ సేవలను నిలిపివేయనున్నారు.

ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ఆపైన ఉండే స్మార్ట్ ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుందని వాట్సాప్‌ ఇటీవల తెలిపింది. అలాగే ఐఓఎస్ 10, అంతకంటే ఎక్కువ వెర్షన్‌ సపోర్ట్ చేసే డివైజ్‌లలో మాత్రమే ఈ మేసేజింగ్ యాప్ పనిచేయనుంది. ఈ క్రమంలోనే నవంబర్‌ 1 నుంచి కొన్ని ఫోన్‌లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. మరి ఆ ఫోన్‌లు ఏంటో ఓసారి చూసేయండి..

ఇవి కూడా చదవండి: Chat Without Internet : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌ చాట్ చేయండి.. ఎలానో తెలుసా..

Prashant Kishor: మరో 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. సమస్యంతా రాహుల్ గాంధీలోనే.. హాట్ కామెంట్ చేసిన పీకే..