Union Bank Jobs 2025: డిగ్రీ అర్హతతో యూనియన్ బ్యాంకులో కొలువులు.. ఎంపికైతే నెలకు రూ.85 వేల జీతం
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో యూనియన్ బ్యాంకులో కొలువులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే..

ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్.. దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులు 250, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) 250 వరకు ఉన్నాయి. మే 20వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్, ఎంబీఏ లేదా పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఏడాది పాటు పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2025వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మే 20, 2025వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..
రాత పరీక్ష మత్తం 150 ప్రశ్నలకు 225 మార్కులకు ఉంటుంది. పార్ట్ 1లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్‌లో 25 మార్కులకు 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌కు 25 మార్కులకు 25 ప్రశ్నలు.. ఇలా 75 మార్కులకు ఉంటుంది. ఇక పార్ట్ 2లో 150 మార్కులకు సంబంధిత పోస్టుకు చెందిన ప్రొఫెషనల్ నాలెడ్జ్‌లో పరీక్ష ఉంటుంది. మొత్తం 150 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. గ్రూప్ డిస్కషన్‌కు 50 మార్కులకు ఉంటుంది. ఇందులో కనీసం 25 మార్కులు తెచ్చుకోవల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




