UGC NET 2024 New Exam Dates: యూజీసీ నెట్‌ రీ-ఎగ్జాం షెడ్యూల్‌ విడుదల.. ఈసారి సీబీటీ పద్ధతిలో పరీక్షలు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET 2024) జూన్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ విడులైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం యూజీసీ నెట్ పరీక్షలు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు జరగనున్నాయి. పేపర్‌ లీకుల నేపథ్యలో ఈ సారి యూజీసీ నెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్ణయించింది. ఈ పరీక్షలకు..

UGC NET 2024 New Exam Dates: యూజీసీ నెట్‌ రీ-ఎగ్జాం షెడ్యూల్‌ విడుదల.. ఈసారి సీబీటీ పద్ధతిలో పరీక్షలు
UGC NET 2024 New Exam Dates
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 02, 2024 | 2:07 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 2: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET 2024) జూన్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ విడులైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం యూజీసీ నెట్ పరీక్షలు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు జరగనున్నాయి. పేపర్‌ లీకుల నేపథ్యలో ఈ సారి యూజీసీ నెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్ణయించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఆడ్మిట్‌ కార్డులు, ఎగ్జాం సెంటర్‌ స్లిప్‌లు త్వరలోనే విడుదల కానున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30, సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టుల్లో పరీక్షల నిర్వహణ బాధ్యతను ఎన్టీయేకు యూజీసీ అప్పగించింది.

కాగా జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతీయేట రెండు సార్లు యూజీసీ నెట్‌ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలి విడతలో విడుదల చేసిన నెట్‌ నోటిఫికేషన్‌కు ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 9,08,580 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 18వ తేదీన పెన్ను, పేపర్‌ విధానంలో పరీక్ష కూడా నిర్వహించారు. మొత్తం 1,200 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. అయితే పరీక్ష జరిగిన 24 గంటల్లోపే పేపర్ లీక్‌ ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ ఈ పరీక్షను రద్దు చేసింది. డార్క్‌ నెట్‌లో యూజీపీ నెట్‌కు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు ప్రత్యక్షమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో నెట్‌ పరీక్షను రద్దు చేసిన యూజీసీ, మరోమారు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.

పరీక్ష తేదీల విడుదలతో పాటు, ఎన్టీయే హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా విడుదల చేసింది. NTA NET 2024 జూన్ పరీక్షకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000 లేదా ఇమెయిల్ ugcnet@nta.ac.inని సంప్రదించవచ్చని పేర్కొంది. యూజీనీ నెట్‌ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష మొత్తం 3 గంటల వ్యవధిలో జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

యూజీసీ నెట్‌ 2024 సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.