TSPSC Exams Postponed: ఆ రాత పరీక్షను వాయిదా వేసిన టీఎస్పీయస్సీ.. త్వరలో కొత్త తేదీలు
తెలంగాణ భూగర్భజలశాఖలో వివిధ నాన్‌గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెలలో నిర్వహించవల్సిన రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో..
హైదరాబాద్, జులై 23: తెలంగాణ భూగర్భజలశాఖలో వివిధ నాన్‌గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెలలో నిర్వహించవల్సిన రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా పరీక్షలు వాయిదా వేసినట్లు టీఎస్పీయస్సీ తెల్పింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ పేర్కొన్నారు.
కాగా ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం.. జులై 21న భూగర్భజలశాఖలో నాన్‌గెజిటెడ్ (ల్యాబ్ అసిస్టెంట్స్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్) పోస్టులకు సీబీఆర్‌టీ విధానంతో రాతపరీక్ష నిర్వహించాల్సి ఉంది. వర్షాల కారణంగా పరీక్ష వాయిదా వేశామని, పరీక్ష ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని కమిషన్ తెల్పింది. మరోవైపు ఉస్మానియా, జేఎన్‌టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు కూడా వర్షం కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ డిప్లొమా కోర్సులకు 21, 22 తేదీల్లో జరగాల్సిన రెండో విడత కౌన్సెలింగ్ కూడా వాయిదా పడింది.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.