TSPSC JL Answer Key 2023: జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష ఆన్సర్ ‘కీ’ విడుదల.. అక్టోబర్ 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను టీఎస్‌పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12, 13, 14వ తేదీల్లో జరిగిన పేపర్-1 పరీక్ష జనరల్ స్టడీస్/ మెంటల్ ఎబిలిటీ, పేపర్-2 పరీక్ష ఇంగ్లిష్/ బోటనీ/ ఎకనామిక్స్/ మ్యాథ్స్.. లకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీలతో పాటు అభ్యర్ధుల రెస్పాన్స్ షీట్‌లను కూడా..
హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను టీఎస్‌పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12, 13, 14వ తేదీల్లో జరిగిన పేపర్-1 పరీక్ష జనరల్ స్టడీస్/ మెంటల్ ఎబిలిటీ, పేపర్-2 పరీక్ష ఇంగ్లిష్/ బోటనీ/ ఎకనామిక్స్/ మ్యాథ్స్.. లకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీలతో పాటు అభ్యర్ధుల రెస్పాన్స్ షీట్‌లను కూడా విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కీలపై అక్టోబర్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతాలు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తన ప్రకటనలో తెల్పింది.
కాగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1392 జూనియర్ లెక్చరర్ నియామకాలకు సంబంధించి సెప్టెంబర్ 12 నుంచి రాత పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మల్టీజోన్ 1లో 724 పోస్టులు, మల్టీజోన్ 2లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 16 సబ్జెక్టులకు గానూ 11 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. రోజుకు రెండు ష్టిఫ్టుల చొప్పున ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.
సబ్జెక్టుల వారీగా జరగాల్సిన పరీక్ష తేదీలు..
- కామర్స్ సబ్జెక్ట పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25
- సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్ సబ్జెక్ట పరీక్ష తేదీ: సెప్టెంబర్ 26
- హిందీ సబ్జెక్ట పరీక్ష తేదీ: సెప్టెంబర్ 27
- చరిత్ర, సంస్కృతం సబ్జెక్ట పరీక్ష తేదీ: సెప్టెంబర్ 29
- ఉర్దూ సబ్జెక్ట పరీక్ష తేదీ: అక్టోబర్ 3
టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని ఓయూలో విద్యార్ధుల ఆందోళన
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్1 పరీక్ష నిర్వహణలో రెండు సార్లు విఫలం అవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా గ్రూప్ 1 పరీక్షను పారదర్శకంగా నిర్వహించలేదని హైకోర్టు ప్రిలిమ్స్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. కొత్త ఛైర్మన్‌ను నియమించి పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని, లేదంటే దీనికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.