TS Eamcet Exam Date 2022: మార్చి14న తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌.. జూన్‌లో పరీక్ష! కీలక మార్పులతో పరీక్ష..

తెలంగాణ ఎంసెట్ 2022కు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. పరీక్ష విధానం, నోటిఫికేషన్‌, పరీక్ష తేదీలకు సంబంధించిన తేదీలు ఖరారు..

TS Eamcet Exam Date 2022: మార్చి14న తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌.. జూన్‌లో పరీక్ష! కీలక మార్పులతో పరీక్ష..
Ts Eamcet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 09, 2022 | 9:31 AM

TS Eamcet 2022 to be held in June last week: ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌–2022 నోటిఫికేషన్‌ (TS Eamcet 2022) ఈ నెల (మార్చి)14న వెలువడే అవకాశం ఉంది. దీనిపై సమీక్ష సమావేశం సోమవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TSCHE) కార్యాలయంలో జరిగింది. ఈ భేటీలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు అంగీకారం కుదిరిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి మంగళవారం మీడియాకు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు హాజరయ్యే సెట్‌లు, జేఈఈ, ఇతర జాతీయ పోటీ పరీక్షలను టీసీఎస్‌ పరిశీలించి.. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసేందుకుగానూ ఎంసెట్ తేదీలను ఖరారు చేయడంపై కసరత్తులు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పరీక్ష కేంద్రాలు, ఎక్కడినుంచి ఎక్కువ మంది విద్యార్ధులు పాల్గొనే అవకాశం ఉందనే అనే అంశాలను టీసీఎస్‌ పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యే వీలుందని, అనంతరం ఎంసెట్‌ తేదీలను ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపుతామని అధికారులు చెప్పారు. కాగా మే నెలలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తవుతాయి. అదే నెలలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలూ ఉంటాయి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఎంసెట్‌ సన్నద్ధతకు విద్యార్థులకు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్‌ చివరి వారంలో ఎంసెట్‌ నిర్వహణకు అనుకూలమైనదిగా ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు.

ఇక ఎంసెట్‌ పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోపు ఎంసెట్‌ ర్యాంకుల వెల్లడి చేయడానికి సన్నద్ధంచేస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉండేది. కానీ, ఈసారి దానికి అవకాశం లేదని ఇప్పటికే అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫస్టియర్‌ పరీక్షల్లో కనీస మార్కులతో ప్రమోట్‌ చేశారు. ఈ మేరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు, ఎంసెట్‌ ర్యాంకుల వెల్లడికి సంబంధం ఉండదు. అందుకే త్వరగా ఫలితాలు వెల్లడించే వీలుంది. అలాగే కౌన్సెలింగ్‌ తేదీలపై మరికొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌ ఫలితాలు, ఐఐటీ, నీట్‌ ప్రవేశాల తేదీలను బట్టి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను ఖరారు చేయాలనే యోచనలో అధికారులున్నారు. కాబట్టి విద్యార్ధులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

Also Read:

Digital India Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తివివరాలివే!