TS CPGET 2021 Results: తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. కామన్ పీజీ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల..
TS CPGET 2021 Results: తెలంగాణలోని ఏడు యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్
TS CPGET 2021 Results: తెలంగాణలోని ఏడు యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ)- 2021 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ ల్లో 92.61 శాతం మంది అర్హత సాధించినట్లు ప్రకటించారు. దీనిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏడు యూనివర్సిటీల పరిధిలోని పీజీ సీట్లను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 78,312 మంది ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 68,836 మంది హాజరు అయినట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో 63,748 మంది అర్హత సాధించినట్లు లింబాద్రి తెలిపారు. కాగా.. ఆగస్ట్ 18 నుంచి సెప్టెంబర్ 5 మధ్య ఈ ఎంట్రెన్స్ పరీక్షలు జరిగాయి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ, పాలమూరు, జెఎన్టీయూలో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఈ పీజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను ఉస్మానియా విశ్వ విద్యాలయం నిర్వహించింది.
ఈ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను osmania.ac.in, cpget.tsche.ac.in అనే అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చని లింబాద్రి సూచించారు. ఈ అడ్మిషన్స్ ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం 27 నుంచి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉండనుంది. అనంతరం యూనివర్సిటీల పరిధిలో సీట్లను కేటాయించనున్నారు.
Also Read: