AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOSS Exams Schedule 2026: ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల.. రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే?

Telangana Open SSC 10th Class Exams 2026: రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పదో తగరతి వార్షిక పరీక్షలకు సంబంధించిన పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మార్చి నుంచి ఏప్రిల్ 2026 వరకు జరగనున్న తెలంగాణ పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు..

TOSS Exams Schedule 2026: ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల.. రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే?
TOSS Exam Fee Schedule 2026
Srilakshmi C
|

Updated on: Dec 07, 2025 | 2:58 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పదో తగరతి వార్షిక పరీక్షలకు సంబంధించిన పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మార్చి నుంచి ఏప్రిల్ 2026 వరకు జరగనున్న తెలంగాణ పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన రుసుము చెల్లింపు తేదీలను TOSS ప్రకటించింది. అర్హత గల విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా డిసెంబర్‌ 11 నుంచి 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది.

ముఖ్యమైన తేదీలు ఇలా..

  • ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు: డిసెంబర్‌ 11, 2025 నుంచి ప్రారంభం
  • ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: డిసెంబర్‌ 26, 2025వ తేదీ వరకు
  • ప్రతి పేపర్‌కు రూ. 25 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 27, 2025 నుంచి జనవరి 2, 2026వ తేదీ వరకు
  • ప్రతి పేపర్‌కు రూ. 50 ఆలస్య రుసుముతో జనవరి 3, 2026 నుంచి జనవరి 7, 2026వ తేదీ వరకు
  • తత్కాల్ (సాధారణ రుసుముతో పాటు రూ. 1000 జరిమానాతో) జనవరి 8, 2026 నుంచి జనవరి 12, 2026వ తేదీ వరకు

కాగా తెలంగాణ రెగ్యులర్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి మార్చి 18, 2026వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు పరీక్షల తేదీలను ఖరారు చేశారు. ఈ సారి పదో తరగతి పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు మధ్య ఒకటి రెండు రోజుల వ్యవధి ఇవ్వాలనే ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ అధికారులు రెండు మూడు రకాల షెడ్యూళ్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పరీక్షల తేదీల షెడ్యూల్‌ ప్రకటనలో జాప్యం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.