NEET UG 2024 Controversy: ‘అందుకే నీట్‌ యూజీ 2024 పరీక్ష రద్దు చేయలేకపోతున్నాం’ కేంద్ర విద్యాశాఖ మంత్రి

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వంటి వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ2024 ప్రవేశ పరీక్ష పేపర్ లీక్‌’ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరీక్షకు ముందు రోజే పేపర్‌ లీకైందంటూ విద్యార్ధులు చెప్పడం తీవ్రదుమారం లేపుతోంది. మరోవైపు ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. అయితే పేపర్‌ లీకైనట్లు ఓ వైపు స్పష్టంగా..

NEET UG 2024 Controversy: 'అందుకే నీట్‌ యూజీ 2024 పరీక్ష రద్దు చేయలేకపోతున్నాం' కేంద్ర విద్యాశాఖ మంత్రి
NEET UG 2024 Controversy
Follow us

|

Updated on: Jun 23, 2024 | 7:34 AM

న్యూఢిల్లీ, జూన్‌ 23: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వంటి వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ2024 ప్రవేశ పరీక్ష పేపర్ లీక్‌’ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరీక్షకు ముందు రోజే పేపర్‌ లీకైందంటూ విద్యార్ధులు చెప్పడం తీవ్రదుమారం లేపుతోంది. మరోవైపు ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. అయితే పేపర్‌ లీకైనట్లు ఓ వైపు స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నా.. కేంద్రం మాత్రం పరీక్షను రద్దుకు మాత్రం ససేమిరా అంటోంది. నీట్‌ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ మీడియా సమక్షంలో చెబుతూ..

నీట్‌ యూజీ 2024 ప్రవేశ పరీక్ష పేపర్‌ లీకేజ్‌ వల్ల కొందరు విద్యార్థులు మాత్రమే లాభపడ్డారు. పరీక్షను రద్దు చేస్తే కష్టపడి చదివి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారు. పాసైన లక్షలాదిమంది కష్టమంతా వృథా అవుతుంది. 2004, 2015లలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. అయితే భారీ ఎత్తున లీకేజీ జరగడంతో అప్పట్లో పరీక్షలను రద్దు చేశారు. ఈసారి మాత్రం పేపర్‌ లీకేజీ కొన్ని సెంటర్లలో మాత్రమే జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నేటెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరును పరిశీలించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేశాం. ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్‌ కె రాధాకృష్ణన్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమస్యను రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. NTA అధికారులతో సహా దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ వివరించారు.

ఇదిలా ఉంటే మరోవైపు నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు కూడా నిరాకరించింది. జులై 6న నిర్వహించాల్సిన కౌన్సిలింగ్‌ను యథాతథంగా కొనసాగించాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!