TS SET 2023 Notification: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2023 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2023 నోటిఫికేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. టీఎస్ సెట్-2023 పరీక్ష అక్టోబర్‌లో జరగనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ యేట టీఎస్ సెట్ నిర్వహిస్తోంది. జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో అక్టోబర్ నెలలో సెట్ పరీక్ష జరుగనుంది. కనీసం 55 శాతం మార్కులతో
హైదరాబాద్, జులై 30: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2023 నోటిఫికేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. టీఎస్ సెట్-2023 పరీక్ష అక్టోబర్‌లో జరగనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ యేట టీఎస్ సెట్ నిర్వహిస్తోంది. జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో అక్టోబర్ నెలలో సెట్ పరీక్ష జరుగనుంది. కనీసం 55 శాతం మార్కులతో సంబంధి సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్ (సీఎస్ఈ, ఐటీ).. పీజీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి అంటూ ఏమీ లేదు.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 5, 2023వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీలకు రూ.2000, బీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/వీహెచ్/హెచ్‌ఐ/ఓహెచ్/ట్రాన్స్‌జెండర్ అభ్యర్ధలకు రూ.1000 పరీక్ష ఫీజు ఉంటుంది. ఇది కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది.
సబ్జెక్టులు..
జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
పరీక్ష విధానం: టీఎస్ సెట్-2023 పరీక్ష ఆన్‌లైన్ విధానంలో (సీబీటీ) రెండు పేపర్లకు జరుగుతుంది. పేపర్1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతీ పేపర్‌కు మూడు గంటల వ్యవధి ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.