TS Gurukul Exams: గురుకుల పరీక్ష కేంద్రాల కేటాయింపులో లీలలు.. ఒక్కో పరీక్ష ఒక్కో జిల్లాలో!
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఆన్‌లైన్ రాత పరీక్షకు హాల్‌టికెట్లు తాగాజా విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి 23 వరకు రోజుకు మూడు షిఫ్టుల్లో జరగనున్న ఈ పరీక్షలకు 2.66 లక్షల మంది హాజరుకానున్నారు. ఐతే గురుకులాల్లో టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్ టికెట్లు చూసుకుని కళ్లు..
దరాబాద్, జులై 30: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఆన్‌లైన్ రాత పరీక్షకు హాల్‌టికెట్లు తాగాజా విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి 23 వరకు రోజుకు మూడు షిఫ్టుల్లో జరగనున్న ఈ పరీక్షలకు 2.66 లక్షల మంది హాజరుకానున్నారు. ఐతే వీటిల్లో టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్ టికెట్లు చూసుకుని కళ్లు తేలేశారు. ఆన్‌లైన్‌లో జరిగే పేపర్-1, 2, 3లలో ఒక్కో పేపర్‌ను ఒక్కో జిల్లా కేంద్రాల్లో కేటాయించారు. గురుకులాల్లో టీజీటీ పోస్టులకు దాదాపు లక్ష మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులకు పేపర్-1, 2, 3 పరీక్షలు ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల్ని వేర్వేరు రోజుల్లో నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. దీంతో అభ్యర్ధులు ఒకరోజు ఒక పేపర్ పరీక్ష రాస్తే ఆ మరుసటి రోజునే వందల కిలోమీటర్ల దూరంలోని మరో పరీక్ష కేంద్రానికి ప్రయాణించి పరీక్ష రాయవల్సి వస్తోంది. ఇలా ఒక్కోపేపర్‌కు వేర్వేరు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి.
అభ్యర్థులందరికీ పేపర్-1, 2, 3 పరీక్షలకు ఒకే పరీక్ష కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని నియామక బోర్డుకు విజ్ఞప్తులు పంపుతున్నారు. వేర్వేరు చోట్ల పరీక్ష కేంద్రాలు కేటాయించడంపై గురుకుల బోర్డు తాజాగా వివరణ ఇచ్చింది. గురుకుల పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయని, కొన్ని జిల్లాల్లో అందుబాటులోని స్లాట్ల కన్నా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారని.. అందుకే పరీక్ష కేంద్రాల కేటాయింపు వేర్వేరు జిల్లాల్లో వేయవల్సి వచ్చిందని వివరించారు. టీజీటీ హాల్‌టికెట్ల జారీకి ముందుగానే ఈ సమస్యను గుర్తించామని, దాదాపు 1600 మందికి ఇలా పరీక్ష కేంద్రాలు కేటాయించాల్సి వచ్చిందని వెల్లడించారు. మరోవైపు గురుకుల పరీక్షలు వాయిదా వేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని, షెడ్యూలు ప్రకారమే ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయని బోర్డు స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.