AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malla Reddy: చండీగఢ్ యూనివర్సిటీని సందర్శించిన మంత్రి మల్లా రెడ్డి.. విద్యార్థులతో మాటామంతి..

Malla Reddy: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీని సందర్శించారు. స్టడీ టూర్‌లో భాగంగా వర్సిటీలో ఉన్న టెక్నాలజీ బిజినెస్‌ ల్యాబోరేటరీ సెంటర్‌, కల్పన చావ్లా సెంటర్ ఫర్‌ రీసెర్చ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలను...

Malla Reddy: చండీగఢ్ యూనివర్సిటీని సందర్శించిన మంత్రి మల్లా రెడ్డి.. విద్యార్థులతో మాటామంతి..
Malla Reddy
Narender Vaitla
|

Updated on: May 18, 2022 | 12:51 PM

Share

Malla Reddy: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీని సందర్శించారు. స్టడీ టూర్‌లో భాగంగా వర్సిటీలో ఉన్న టెక్నాలజీ బిజినెస్‌ ల్యాబోరేటరీ సెంటర్‌, కల్పన చావ్లా సెంటర్ ఫర్‌ రీసెర్చ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పోషిస్తున్న పాత్రపై మంత్రి మాట్లాడుతూ.. ‘సాంకేతికత కేవలం మనుషుల జీవన విధానాన్ని మార్చడమే కాకుండా ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. టెక్నాలజీ, ఆర్థికాభివృద్ధి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. విద్యార్థులంతా మీకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని, గ్యాడ్జెట్లను ఉపయోగించుకొని నైపుణ్యాలను పెంపొదించుకోవాల’ని మల్లారెడ్డి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

యువత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ అగ్ర స్థానంలో ఉందన్న మంత్రి.. ప్రతీ రంగంలో దేశాన్ని ముందు స్థానంలో నిలిపే శక్తి యువతకు ఉందన్నారు. విద్యార్థులు కూడా తమకు అందిస్తున్న ప్రపంచ స్థాయి సౌకర్యాలను, నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని మల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు.

Malla Reddy

జీవితంలో విజయం సాధించాలంటే..

క్రమశిక్షణతో ఉంటూ, సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ, డబ్బును వృథా చేయకుండా ఉంటే జీవితంలో అనుకున్న విజయాలను సాధించవచ్చని మంత్రి విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. అందుకు తన జీవితాన్నే ఉదాహరించారు. ఒక పాల వ్యాపారిగా జీవితం మొదలు పెట్టిన తాను దేశంలోనే అతిపెద్ద విద్యాసంస్థలను నెలకొల్పానని, రాష్ట్ర మంత్రి అయ్యాయని చెప్పుకొచ్చారు. ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో నాలాంటి వ్యక్తే ఈ స్థాయికి వచ్చాడంటే, ఇన్ని అవకాశాలు ఉన్న మీరు ఏ స్థాయికి చేరుకోవచ్చో ఆలోచించండి అంటూ విద్యార్థుల్లో మంత్రి జోష్‌ నింపారు. తెలంగాణకు చెందిన 468 మంది చండీగడ్‌ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారని చెప్పిన మంత్రి.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను పొందుతున్నారని పేర్కొన్నారు.

Fdf

ఈ సందర్భంగా మంత్రి యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులు ఓర్సు వినయ్‌, శుభమ్‌ శ్రీవాస్తవ్‌లతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వీరిద్దరూ ప్రస్తుతం ప్రతిష్టాత్మక నాసా కాన్‌సాట్‌ (NASA CANSAT) ప్రాజెక్ట్‌కు పోటీపడుతున్నారు. వచ్చే నెల అమెరికాలో జరగనున్న పోటీలో భారత్‌ తరఫున వీరిద్దరు పాల్గొంటున్నారు. వీరితో పాటు క్యాంపస్‌లో తన ప్రతిభతో రాణిస్తున్న మరికొంత మంది తెలంగాణ విద్యార్థులను ప్రశసించారు మల్లారెడ్డి. అంతేకాకుండా చండీగఢ్‌ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, పలు రకాల కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..