TS Inter Supply 2025 Results: మరికాసేపట్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ఈఏపీసెట్, జేఈఈ, నీట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కులు కీలకం కావడంతో విద్యార్ధులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 4.2 లక్షల మంది విద్యార్ధుల నిరీక్షణకు తెరపడనుంది. సోమవారం మధ్యాహ్నం ఆన్ లైన్ విధానంలో..

హైదరాబాద్ జూన్ 16: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫప్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను సోమవారం (జూన్ 16) విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు సోమవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in, results.cgg.gov.in లలో నేరుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్ధుల మార్కుల వివరాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,12,724 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో 2,49,204 మంది, ఒకేషనల్ విభాగంలో 17,003 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ జనరల్ విభాగంలో 1,34,988 మంది, ఒకేషనల్ విభాగంలో 12,402 మంది విద్యార్థులు పరీక్షలకు అప్లై చేసుకున్నారు. మే 22 నుంచి మే 29వ తేదీ వరకు రోజుకు రెండు విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. కాగాగా ఏప్రిల్ 22న రెగ్యులర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ఈఏపీసెట్, జేఈఈ, నీట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కులు కీలకం కావడంతో విద్యార్ధులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రకటన ఇప్పటికే వెలువడింది. జూలై మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే ఉంది. ఈసారి అగస్టు 14లోపు సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.