AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Board: ఇకపై ఇంటర్మీడియట్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌.. ఆ మార్పులు ఈసారికి లేనట్లే!

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌ ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. రాత పరీక్ష 80 మార్కులకే నిర్వహించి, ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. కాగా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌లో..

TS Inter Board: ఇకపై ఇంటర్మీడియట్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌.. ఆ మార్పులు ఈసారికి లేనట్లే!
English Practicals
Srilakshmi C
|

Updated on: May 19, 2023 | 9:12 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌ ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. రాత పరీక్ష 80 మార్కులకే నిర్వహించి, ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. కాగా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌లో భౌతికశాస్త్రం, రసాయన, జీవ, వృక్ష శాస్త్రాలతో పాటు ఒకేషనల్‌ కోర్సుల్లో మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. ఇక నుంచి ఇంగ్లిష్‌ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ ప్రవేశపెడుతున్నట్లు బోర్డు నిర్ణయం తీసుకుంది. జూనియర్‌ కళాశాలల తరగతులు ప్రారంభమయ్యే నాటికి ప్రాక్టికల్స్‌పై ఇంటర్‌ బోర్డు స్పష్టత ఇవ్వనుంది.

గత నవంబరులో జరిగిన ఇంటర్‌ బోర్డు పాలకమండలి సమావేశంలో కొన్ని సంస్కరణలు అమలుచేయాలని నిర్ణయించింది. అందులో ఇంగ్లిషులో ప్రాక్టికల్స్‌ అమలు చేయడం కూడా ఉంది. విద్యార్ధుల్లో ఇంగ్లిస్‌ స్కిల్స్‌ పెంపొందిచాలని, తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్స్‌కు సిలబస్‌ కూర్పుపై భాషా నిపుణులతో బోర్డు అధికారులు చేసిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. అందుకు సంబంధించిన పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు వైవా తరహాలోనే ఈ పరీక్ష ఉంటుంది. ఇంటర్ స్థాయిలో క్లాస్‌ రూంలో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

ఈసారి మార్పుల్లేవ్‌..

ఇంటర్‌లో ద్వితీయ భాష సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, హిందీ తదితరాల సిలబస్‌ మార్చాల్చి ఉండగా కొన్ని కారణాల రిత్య ఈ ఏడాది (2023-24) ద్వితీయ భాషను పాత సిలబస్‌ ప్రకారమే బోధించనున్నారు. మరోవైపు ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు ఒకే స్థాయి గణితం సిలబస్‌ అమలుచేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం నుంచి మార్చాలని భావించినా ఈ సారి కుదరట్లేదని బోర్డు తెల్పింది. కామర్స్‌లో కూడా ఏమార్పు చేయబోవట్లేదని వెల్లడించింది. కొత్త కోర్సుగా సీఈఏ (కామర్స్‌, ఎకనామిక్స్‌, అకౌంటింగ్‌) గ్రూపు కూడా ఈ విద్యాసంవత్సరం అమలు చేయడం లేదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ వలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ వలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది