TS Inter: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండ్ ఇయర్ ఇంగ్లిష్ సిలబస్‌లో మార్పులు..
TS Inter: తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ ఇయర్ ఇంగ్లిష్‌లో సిలబస్ మార్పు చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ అధికారికప ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం..
TS Inter: తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ ఇయర్ ఇంగ్లిష్‌లో సిలబస్ మార్పు చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ అధికారికప ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను విడుదల చేశారు. మారిసిన సిలబస్ 2022-23 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. అయితే ఇటీవల ప్రకటించిన ఫలితాలత్లో ఫెయిలైన అభ్యర్థులకు పాత సిలబస్ ఆధారంగానే పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ స్పష్టం చేశారు.
మార్చి 2023, మే 2023లో నిర్వహించే పరీక్షల్లో పాల్గొన విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రకారం పరీక్ష పేపర్ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ఐదేళ్లకు ఒకసారి సిలబస్‌లో మార్పులు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయం మేరకే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల 2019-2020 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన హ్యుమనిటీస్ సబ్జెక్టుల సిలబస్‌ను మార్చిన విషయం తెలిసిందే.
సప్లమెంటరీ ఫీజు గడువు పెంపు..
ఇదిలా ఉంటే ఇంటర్ బోర్డ్ తాజాగా సప్లిమెంటరీ పరీక్ష ఫీజుకు చెల్లింపు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8వ తేదీ (శుక్రవారం) వరకు విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా సప్లీ ఫీజులు చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు వారి వారి కాలేజీల్లో ఫీజులు చెల్లించుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులు, కాలేజీల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..