TS DSC 2023 Notification: 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సర్కార్ ఉత్తర్వులు జారీ.. డీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ గురువారం (ఆగస్టు 24) గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 ఎస్‌జీటీ పోస్టులు, 1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలియజేస్తూ..
హైదరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ గురువారం (ఆగస్టు 24) గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 ఎస్‌జీటీ పోస్టులు, 1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలియజేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం (ఆగస్టు 25) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారా ఎంపిక చేయడం లేదని ప్రభుత్వ స్పష్టం చేసింది. గతంలో మాదిరి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నియామకాలు చేపడుతుందని విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు 27వ తేదీలోపు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే టెట్‌లో క్వాలిఫై అయిన వారితో పాటు తాజాగా ఇచ్చిన టెట్ నోటిఫికేషన్‌లో ఆర్హత సాధించేవారు కూడా టీఆర్‌టీ టీచర్ పోస్టులకు పోటీ పడేందుకు అర్హులుగా ప్రభుత్వం తేల్చిచెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్-2023) సెప్టెంబరు 15న నిర్వహించనున్నారు. ఇక ఫలితాలు కూడా సెప్టెంబర్ 27న వెల్లడించనున్నారు. జిల్లాల వారీగా ఆయా జిల్లాల డీఎస్సీలు టీచర్ ఉద్యోగాల నియామకాలు చేపడతాయి. ఇక ఇప్పటికే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్ట్ విధానంలో 1,264 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీచేసింది విద్యాశాఖ. కేజీబీవీల్లో సిబ్బందిని క్రమబద్ధీకరించడం కుదరదని ఇప్పటికే మంత్రి సబితా స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో 12,150 బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఈ పోస్టులకు రాత పరీక్ష పూర్తయ్యింది.
ఆగస్టు 30 నుంచి గేట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గేట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కొత్తగా గేట్ పరీక్షలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌ను ప్రవేశ పెట్టారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక గేట్ 2024 పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు కూడా పొందవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.