TS Eamcet 2023: తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తుల వెల్లువ.. ఇప్పటి వరకు ఎంత మంది అప్లై చేసుకున్నారంటే..
తెలంగాణ ఎంసెట్-2023కు ఈ ఏడాది దరఖాస్తులు పోటెత్తాయి. భారీగా విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గతేడాది 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి దరఖాస్తు గడువు ముగియకుండానే ఆ సంఖ్యను దాటింది..
తెలంగాణ ఎంసెట్-2023కు ఈ ఏడాది దరఖాస్తులు పోటెత్తాయి. భారీగా విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గతేడాది 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి దరఖాస్తు గడువు ముగియకుండానే ఆ సంఖ్యను దాటింది. ఏప్రిల్ 6వ తేదీ నాటికి దాదాపు 2,70,164 మంది విద్యార్ధులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చివరి తేదీ ఏప్రిల్ 10 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 95,344ల మంది అగికల్చర్, ఫార్మసీకి దరఖాస్తు చేసుకున్నారు. 1,74,820 మంది ఇంజినీరింగ్‌కు అప్లై చేసుకున్నారు. బీటెక్‌లో కొత్త కోర్సులు వస్తుండటం, ఉద్యోగావకాశాలు పెరుగుతున్నందున విద్యార్థులు ఎంసెట్‌కు రాసేందుకు ఆసక్తి చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీరింగ్‌కు 39,628 మంది, అగ్రికల్చర్‌కు 15,967 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్ కో-కన్వీనర్ ఆచార్య విజయకుమార్‌రెడ్డి చెప్పారు. గత ఏడాది ఏపీ నుంచి ఇంజినీరింగ్‌కు 35 వేలు, అగ్రికల్చర్‌కు 16,200 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఏపీ నుంచి ఎంసెట్ రాసేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎంసెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.