TS DSC 2024 Notification: నిరుద్యోగులకు తీపి కబురు! నేడో.. రేపో.. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ రేపు లేదా ఎల్లుండి (గురువారం లేదా శుక్రవారం) వెలువడే అవకాశం ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పది రోజులపాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని, ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా ఖరారైనట్లు సమాచారం. పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను..

TS DSC 2024 Notification: నిరుద్యోగులకు తీపి కబురు! నేడో.. రేపో.. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌
TS DSC 2024 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 28, 2024 | 8:32 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ రేపు లేదా ఎల్లుండి (గురువారం లేదా శుక్రవారం) వెలువడే అవకాశం ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పది రోజులపాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని, ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా ఖరారైనట్లు సమాచారం. పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. గత డీఎస్సీకన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకూ సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

కాగా మొత్తం 11,062 టీచర్‌ పోస్టులకు గానూ విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే అనుమతి కూడా లభించింది. దీంతో నేడో, రేపో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావించినా షెడ్యూల్‌ ఖరారు, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో కాస్త ఆలస్యం అయిందని అధికారులు తెలిపారు. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నామన్నారు.

విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్‌ పోస్టుల ఖాళీలున్నట్లు విద్యాశాఖ తెలిపింది. వాటిల్లో ఎస్‌జీటీలను నేరుగా నియమించడానికి వీలుంది. దీంతో ప్రస్తుతం వెలువడనున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్‌జీటీలే ఉండే వీలుంది. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల ద్వారా ఎస్‌జీటీలతో 70 శాతం వరకూ భర్తీ చేవామని, మిగిలిన 30 శాతం నేరుగా నియామకం చేపడతామన్నారు. పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండటంతో స్కూల్ అసిస్టెంట్‌ పోస్టులపై తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1500 నుంచి 2000 వరకూ ఎస్‌ఏ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా చేపట్టే వీలుందని అంచనా. భాషా పండితులు, పీఈటీలు ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులకు ప్రకటన వెలువడే వీలుందని తెలుస్తోంది. గతేడాది ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది టెట్‌లో అర్హత సాధించారు. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే