TS 10th Supply Exams 2025: మరో 2 రోజుల్లో పదో తగరతి సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్ ఇదే!
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా జారీ అయ్యాయి. విద్యార్ధులు పాఠశాల ప్రిన్సిపల్ నుంచి లేదా వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు ఆయా తేదీల్లో ఈ పరీక్షలు..

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా జారీ అయ్యాయి. విద్యార్ధులు పాఠశాల ప్రిన్సిపల్ నుంచి లేదా వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు ఆయా తేదీల్లో ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు.
కాగా ఈ ఏడాది మొత్తం 42,832 మంది విద్యార్ధులు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 26,286 మంది అబ్బాయిలు, 16,546 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిటన్లు విద్యాశాఖ పేర్కొంది.
పదో తరగతి 2025 సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే
- జూన్ 3న- ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1, 2 (కాంపోజిట్ కోర్సు)
- జూన్ 4న- సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
- జూన్ 5న- థర్డ్ లాంగ్వేజ్ పరీక్ష
- జూన్ 6న- మ్యాథ్స్ పరీక్ష
- జూన్ 9న- ఫిజికల్ సైన్స్ పరీక్ష
- జూన్ 10న- బయోలాజికల్ సైన్స్ పరీక్ష
- జూన్ 11న- సోషల్ స్టడీస్ పరీక్ష
- జూన్ 12న- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష
- జూన్ 13న- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పార్ట్ 2 పరీక్ష
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




