AP Mega DSC 2025: వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మెగా డీఎస్సీ హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం వల్ల..

అమరావతి, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మెగా డీఎస్సీ హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం వల్ల దరఖాస్తులు సంఖ్య అమాంతం పెరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారంతా ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
మరోవైపు కూటమి సర్కార్ వాట్సప్ ద్వారా కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. మన మిత్ర వాట్సప్ నెంబర్ 95523 00009కు Hi అని మెసేజ్ చేసి హాల్‌టికెట్లు చిటికెలో పొందొచ్చు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అభ్యర్ధులకు తెలియజేశారు. ఇక జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల్లో మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీ) అభ్యర్థులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 6 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 6న టీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం పరీక్ష, హిందీ-వీహెచ్, ఫిజికల్ సైన్స్-హెచ్‌హెచ్, ఫిజికల్ సైన్స్ వీహెచ్, తెలుగు లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 11న టీజీటీ హిందీ లాంగ్వేజ్ పరీక్ష, జూన్ 22న టీజీటీ తెలుగు లాంగ్వేజ్ పరీక్ష, జూన్ 25న టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం పరీక్ష, జూన్ 26న టీజీటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష, జూన్ 27న టీజీటీ సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




