TS Inter: ఈసారి ఇంటర్‌ ఎగ్జామ్స్‌పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసిన బోర్డ్‌.. పూర్తి వివరాలు..

TS Inter: కరోనా (Corona)కారణంగా గత రెండు అకడమిక్స్‌ ఇయర్స్‌లో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తూ...

TS Inter: ఈసారి ఇంటర్‌ ఎగ్జామ్స్‌పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసిన బోర్డ్‌.. పూర్తి వివరాలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 05, 2022 | 8:31 PM

TS Inter: కరోనా (Corona)కారణంగా గత రెండు అకడమిక్స్‌ ఇయర్స్‌లో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తూ విద్యార్థులను ప్రమోట్‌ చేస్తూ వచ్చాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో ఈసారి కూడా ప్రాక్టికల్స్‌ ఉండవన్నట్లు గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. కొన్ని పత్రికల్లో కూడా ఈసారి కూడా ప్రాక్టికల్స్‌ నిర్వహణ సందేహం అన్నట్లు వార్త కథనాలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై ఇంటర్‌ బోర్డ్‌ క్లారిటీ ఇచ్చింది.

ఇంటర్‌ పరీక్షలపై జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టిన ఇంటర్‌ బోర్డ్‌ క్లారిటీ ఇచ్చేసింది. ఈసారి పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని తేల్చి చెప్పేసింది. ఈ విషయమై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘గతేడాది కరోనా కారణంగా భౌతికంగా తరగతులు నిర్వహించలేదు, కేవలం 45 రోజులు మాత్రమే తరగుతులు జరిగాయి. ఈ కారణంగానే పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాల్సి వచ్చింది. అయితే 2021-2022 అకడమిక్‌ ఇయర్‌లో పరిస్థిలో మార్పు వచ్చింది. జనవరిలో కేవలం 14 రోజులు మాత్రమే కాలేజీలు మూతపడ్డాయి. ఫిబ్రవరి 1 నుంచి యథాతధంగా తరగతులు కొనసాగుతున్నాయి.

వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ప్రాక్టికల్‌ పరీక్షలను ఎప్పటిలాగే థియరీ పరీక్షలకు ముందే నిర్వహించనున్నాము. పరీక్షలను నిర్వహించుకుండానే ప్రమోట్‌ చేసే ఆలోచనే లేదు. ప్రాక్టికల్‌, థియరీ పరీక్షల షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్నాము. విద్యార్థులంతా ఈ విషయాన్ని గమనించాలి’ అంటూ తెలంగాణ బోర్డ్‌ స్పష్టతనిచ్చింది.

Also Read: Oppo Watch Free: భారత మార్కెట్లోకి ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. ఫీచర్లు చూసే ఫిదా అవ్వాల్సిందే..

IND vs WI: టీమ్‌ ఇండియాలోకి మళ్లీ ‘కుల్చా’ జోడి.. మ్యాజిక్‌ పనిచేసేనా..?

సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ.. రామానుజ ఆదర్శాలకు ఈ విగ్రహం ప్రతీక..