AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Holidays 2025: హమ్మయ్యా.. బడి పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయ్!

బుధవారం పాఠశాలలకు చివరి పని దినం కావడంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కేరింతలు కొడుతూ ఇళ్లకు చేరుకున్నారు. హాస్టల్‌ విద్యార్థులు కూడా అధిక సంఖ్యంలో ఇంటిబాట పట్టడంతో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలన్నీ మూత పడ్డాయి..

Summer Holidays 2025: హమ్మయ్యా.. బడి పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయ్!
Summer Holidays
Srilakshmi C
|

Updated on: Apr 24, 2025 | 6:22 AM

Share

అమరావతి, ఏప్రిల్ 24: ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేసవి సెలవులను ప్రకటించాయి. షెడ్యూల్‌ ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఏప్రిల్ 23వ తేదీ (బుధవారం)తో ముగిసింది. చివరి రోజు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేశారు. దీంతో గురువారం (ఏప్రిల్ 24) అన్ని విద్యాసంస్థలకు సెలవులు అమలులోకి వచ్చాయి. వేసవి సెలవులు జూన్‌ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి.

బుధవారం పాఠశాలలకు చివరి పని దినం కావడంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కేరింతలు కొడుతూ ఇళ్లకు చేరుకున్నారు. హాస్టల్‌ విద్యార్థులు కూడా అధిక సంఖ్యంలో ఇంటిబాట పట్టడంతో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలన్నీ మూత పడ్డాయి. హాస్టళ్లలో ఇన్నాళ్లు ఉన్న విద్యార్థులు తమ ట్రంకు పెట్టెలు, బ్యాగులతో ఇళ్లకు బయల్దేరారు. కాగా ఇప్పటికే స్టేట్‌, సెంట్రల్‌ సిలబస్‌కు సంబంధించిన పరీక్షలన్నీ పూర్తి చేయగా.. విద్యార్ధులకు మార్కులను కూడా అందించారు.

అయితే ఏపీలో జూనియర్‌ కాలేజీలు జూన్‌ 2న తిరిగి తెరచుకోనున్నాయి. కాస్త ముందుగానే ఇంటర్‌ విద్యార్ధులకు విద్యా సంవత్సరం ప్రారంభించాలని అధికారులు ఈ మార్పు చేశారు. ఇక పాఠశాలలు మాత్రం కొత్త విద్యా సంవత్సరం(2025-26) జూన్‌ 12న పునఃప్రారంభం అవుతాయి. అయితే అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్‌ 6న విధుల్లో చేరాలని ఏపీ విద్యా శాఖ ఆదేశించింది. అటు తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం జూన్‌ 13 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అంటే వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు ఇచ్చారన్నమాట. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలో తిరగవద్దని, ముఖ్యంగా చెరువులు, కుంటలు, బావుల వద్దకు సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విద్యాశాఖ అధికారులు బడి పిల్లలకు సూచించారు. తమ పిల్లలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..