Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Pre-Final Exams: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు షురూ.. టైం టేబుల్‌ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. వీటికి ముందు నిర్వహించే ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో మార్చి 6 నుంచి ప్రారంభం అవుతాయి. ఇవి ముగిసిన తర్వాత ఏపీలో మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. ఇక తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో షెడ్యూళ్లు వచ్చేశాయ్‌..

SSC Pre-Final Exams: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు షురూ.. టైం టేబుల్‌ ఇదే
SSC Pre-Final Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 07, 2025 | 2:12 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు మార్చి 6 నుంచి ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. గతంలో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈసారి రంజాన్‌ పండగ సందర్భంగా పరీక్షల సమయాల్లో మార్పు చేస్తూ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది కూడా. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 12.15 గంటల లోపుపే మధ్యాహ్న భోజనం అందించాలని ఆయా పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ పదో తరగతి ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..

  • మార్చి 6వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 7వ తేదీన సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 10వ తేదీన ఆంగ్లము
  • మార్చి 11వ తేదీన గణితం
  • మార్చి 12వ తేదీన భౌతిక శాస్త్రం
  • మార్చి 13వ తేదీన జీవ శాస్త్రం
  • మార్చి 15వ తేదీన సోషల్ స్టడీస్

ఏపీలో ఫిబ్రవరి 10 నుంచి ప్రీఫైనల్‌ పరీక్షలు ప్రారంభం

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్ష ఉంటుంది. భౌతిక, రసాయన శాస్త్రాలు ఒక పేపర్‌గా, జీవశాస్త్రం మరో పేపర్‌గా 50 మార్కుల చొప్పున 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

ఏపీ టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షల పూర్తి టైం టేబుల్‌ ఇదే..

  • ఫిబ్రవరి 10వ తేదీ ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌ ఏ), ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1(కాంపోజిట్‌ కోర్సు) పరీక్షలు
  • ఫిబ్రవరి 11వ తేదీ సెకండ్‌ లాంగ్వేజ్ పరీక్ష
  • ఫిబ్రవరి 12న ఇంగ్లిషు పరీక్ష
  • ఫిబ్రవరి 13న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (కాంపోజిట్‌ కోర్సు), ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్‌) పరీక్ష
  • ఫిబ్రవరి 15న గణితం పరీక్ష
  • ఫిబ్రవరి 17న భౌతిక శాస్త్రం పరీక్ష
  • ఫిబ్రవరి 18న జీవ శాస్త్రం పరీక్ష
  • ఫిబ్రవరి 19న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్‌), ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ) పరీక్ష
  • ఫిబ్రవరి 20న సోషల్‌ స్టడీస్‌ పరీక్ష

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.