AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constable GD 2025 Exam Dates: 39,481 కానిస్టేబుల్ పోస్టులు.. నియామక రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలు ఆయా తేదీల్లో మొత్తం 13 భాషల్లో జరగనున్నాయి..

Constable GD 2025 Exam Dates: 39,481 కానిస్టేబుల్ పోస్టులు.. నియామక రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌
SSC Constable GD 2025 Exam Dates
Srilakshmi C
|

Updated on: Nov 20, 2024 | 4:07 PM

Share

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటన జారీ చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం కానిస్టేబుల్ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగున్నట్లు పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరిలో జరగనున్నాయి. ఈ పరీక్ష ఇంగ్లిష్‌, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. రాతపరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు, ఇంగ్లిష్‌/ హిందీ విభాగం నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం వర్తిస్తుంది.

కానిస్టేబుల్‌ పరీక్ష ‘కీ’లో తప్పులపై ఆధారాలు సమర్పించండి: అభ్యర్థులకు ఏపీ హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష విషయంలో ఏపీ పోలీసు నియామక బోర్డు విడుదల చేసిన తుది ‘కీ’లో తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన కోర్టు తప్పులను నిరూపించేందుకు ఆధారాలను తమ ముందు ఉంచాలని అభ్యర్థులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్