Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Fee: ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులకు అడ్డుకట్టేది..? గత మూడేళ్లలో ఎన్నో రెట్లు పెరిగిన ఫీజులు..

ప్రస్తుత రోజుల్లో చదువును 'కొన్న' వారే ఉన్నత స్థాయిలకు చేరుతున్నారు. మిగతా వారి పరిస్థితి అధోగతే. ఎక్కడ చూసినా స్కూల్‌ ఫీజులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలోని పెద్ద, చిన్న నగరాలనే తేడా లేకుండా సర్వత్రా విద్య ఖరీదైనదిగా మారింది. స్కూల్‌ ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. లక్షల డబ్బు చెల్లించి పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చతికిల పడుతున్నారు..

School Fee: ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులకు అడ్డుకట్టేది..? గత మూడేళ్లలో ఎన్నో రెట్లు పెరిగిన ఫీజులు..
Schools Across India Hiked Fee
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2025 | 8:26 PM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్కూల్‌ ఫీజులు గణనీయంగా పెరిగాయి. 5 శాతం దాటని ధనవంతుల సంగతి పక్కన పెడితే.. మిగతా 95 శాతం మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఈ ఆర్థిక భారం మోయలేక పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక మనోవేధనకు గురవుతున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు సర్వాత్రా ఇదే పరిస్థితి. ముఖ్యంగా గత మూడేళ్లలో స్కూల్‌ ఫీజులు అనేక రెట్లు పెరిగాయని స్కూల్‌ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాల ఫీజులు మూడు ఏళ్లలోనే 50 నుంచి 80 శాతం పెరిగాయని తాజా జాతీయ సర్వే సైతం నిర్ధారించింది. స్కూల్‌ ఫీజులపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్‌ స్కూల్‌ యాజమన్యాలు ఇష్టారీతిగా యేటా ఫీజులు పెంచుకుంటూ వెళ్తున్నారు. దీంతో పిల్లలను చదివించడానికి తల్లింద్రులకు తడిసి మోపెడవుతుంది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 44 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలో గత మూడేళ్లలో ఫీజులు 50 నుంచి 80 శాతం పెరిగాయని చెప్పినట్లు సర్వే నివేదిక వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా ఉన్న 309 జిల్లాల్లోని 31 వేల మంది స్కూల్‌ విద్యార్ధుల తల్లిదండ్రులపై ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 93 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల అధిక ఫీజుల నియంత్రణపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల పెంపుదల జాతీయ దృగ్విషయమని దీనిపై కేంద్రం నిఘ తప్పనిసరిగా ఉండాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర.. ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే పాఠశాల ఫీజులపై ఆయా ప్రభుత్వాల పట్టు ఉందని, అక్కడ ఫీజులు పక్కాగా నియంత్రిస్తున్నాయని పేర్కొంది. మరికొద్ది రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం (2025-26) ప్రారంభంకానున్న నేపథ్యంలో అధిక మంది తల్లిదండ్రులు స్కూల్‌ ఫీజులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలీ చాలని జీతంతో సంసారాన్ని లాగే మధ్యతరగతి పౌరుడికి ప్రైవేట్ పాఠశాలల్లో పరిమితికి మించి పెరుగుతున్న ఫీజుల భారాన్ని మోయడం పెను సవాలేనని సర్వే పేర్కొంది.

మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాఠశాల ఫీజుల పెరుగుదలకు సంబంధించి 100 కి పైగా ఫిర్యాదులు అందడంతో ఈ సర్వే నిర్వహించినట్లు లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. సర్వేలో 8 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ ఫీజులు 80 శాతానికిపైగా పెరిగాయని చెప్పగా, 36శాతం మంది 50 – 80 శాతం మధ్య పెరిగినట్లు పేర్కొన్నారని సర్వే నివేదిక తేలింది. మరో 8 శాతం మంది తమ వార్డు పాఠశాలలో స్కూల్ ఫీజులు 30 నుంచి 50 శాతం వరకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తంగా ఈ సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రులలో 44 శాతం మంది తమ పిల్లలు చదువుతున్న పాఠశాల్లో గత 3 మూడేళ్ల 50-80 శాతం ఫీజులు పెంచినట్లు చెబుతున్నారు. అయితే కేవలం 7 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే తమ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల అధిక ఫీజుల పెంపును సమర్థవంతంగా నియంత్రిస్తున్నాయని చెప్పడం విశేషం. ఇక 46 శాతం మంది తమ రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టారు. స్కూల్ ఫీజులను నియంత్రించడంలో తమ ప్రభుత్వాలు పూర్తిగి విఫలమైనట్లు ఆగ్రహించారు. 47 శాతం మంది తమ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న మొత్తం 93 శాతం మంది తల్లిదండ్రులు తమ రాష్ట్ర ప్రభుత్వల వైఫల్యాన్ని దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి

పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాగులో ఫీజులు ఉంచడం ప్రస్తుతం అత్యవసరంగా మారిందని. హైదరాబాద్‌లో రాబోయే విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు కోరుతున్న పిల్లల తల్లిదండ్రులు ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నట్లు సర్వే తెలిపింది. ఈ ఫీజులను నియంత్రించడానికి ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదని, విద్యా శాఖ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. బెంగళూరు, ఢిల్లీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.