Hiring Trends: పనిచేసే ప్రాంతం ఆధారంగా జీతాల్లో మార్పులు రానున్నాయా.? ప్రస్తుత జాబ్‌ ట్రెండ్స్‌పై యూఎస్‌టీ గ్లోబల్‌ హెడ్‌ ఎమన్నారంటే.

Hiring Trends 2021: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే ఐటీ రంగంపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. కొంతమంది ఉద్యోగాలు సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఇక మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతాలను సైతం తగ్గించుకున్నాయి. అయితే...

Hiring Trends: పనిచేసే ప్రాంతం ఆధారంగా జీతాల్లో మార్పులు రానున్నాయా.? ప్రస్తుత జాబ్‌ ట్రెండ్స్‌పై యూఎస్‌టీ గ్లోబల్‌ హెడ్‌ ఎమన్నారంటే.
Job Trends 2021
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 13, 2021 | 2:01 PM

Hiring Trends 2021: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే ఐటీ రంగంపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. కొంతమంది ఉద్యోగాలు సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఇక మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతాలను సైతం తగ్గించుకున్నాయి. అయితే కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో చాలా కంపెనీలు జీతాలు తగ్గించగా.. ప్రస్తుతం మళ్లీ జీతాలను పెంచే పనిలో పడ్డాయి. ప్రస్తుతం జాబ్‌ మార్కెట్లో ఇదే ట్రెండ్‌ కనిపిస్తోందని చెబుతున్నారు ప్రముఖ ఐటీ సేవల సంస్థ యూఎస్‌టీ గ్లోబల్‌ హెడ్‌ వెంకటేష్‌ రాధా క్రిష్ణన్‌.. కరోనా మహమ్మారి ఉద్యోగుల జీతాలపై ఎలాంటి ప్రభావం చూపింది. ఫ్రెషర్స్‌ను నియమించుకునే క్రమంలో కంపెనీలు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.లాంటి వివరాలను రాధా క్రిష్ణన్‌ పంచుకున్నారు. ప్రస్తుతం జాబ్‌ట్రెండ్స్‌ ఎలా ఉందన్న విషయాలు ఆయన మాటల్లోనే..

కరోనా తర్వాత నియామకాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..

కరోనా పాండమిక్‌ తర్వాత ఐటీ రంగంలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ కల్చర్‌ వల్ల మన నివాస స్థలాలే ఆఫీసులుగా మారిపోయాయి. ఐటీ రంగంలో ఎక్కువ శాతం కంపెనీలు ఇదే విధానానికి మొగ్గు చూపుతున్నాయి. నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం ప్రాధాన్యంగా మారింది. నాకు తెలిసినంత వరకు డిజిటల్‌ నైనుణ్యాలు బాగా అవసరమవుతుతాయి. ఇది కేవలం ఈ ఒక్క ఏడాదికే పరిమితం కాకుండా భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. కరోనా అన్ని రకాల రంగాలపై ప్రభావం చూపింది. దీంతో కంపెనీలు సైతం కొత్త తరహా పని విధానాన్ని అవలంభించాల్సి వచ్చింది. క్లౌడ్‌, యూఐ/యూఎక్స్‌, ఆర్‌పీఏ, డేటా ఇంజనీరింగ్‌, సైబర్‌ సెక్యూరిటీలో పెను మార్పులు వచ్చాయి.

ఫ్రెషర్స్‌ నియామకం ఎలా ఉంది..?

ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకోవడం బాగా పెరిగింది. చిన్న, మధ్య స్థాయి కంపెనీలు తమ మొత్తం ఉద్యోగుల్లో 10 నుంచి 15 శాతం ఫ్రెషర్స్‌ను ఉండేలా చూసుకుంటున్నాయి. కరోనాకు ముందు కంపెనీలు ఉద్యోగులను తీసుకొని శిక్షణ ఇచ్చేవి. మా కంపెనీ విషయానికొస్తే.. మేము ‘ఆల్ఫా’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేప్టటాం. ఇది ఏడాది పాటు కొనసాగుతుంది. ఈ ఏడాది చివరికి నాటికి మేము 2000కిపైగా యంగ్‌ గ్రాడ్యుయేట్స్‌ను తీసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం.

ఫ్రెషర్స్‌లో ఎలాంటి అంశాలను చూస్తారు.?

చాలా కంపెనీలు డిజిటల్‌ నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నారు. 2021-2022 ఏడాదికి గాను ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్చర్‌, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంజనీరింగ్‌ వంటి వాటికి డిమాండ్‌ బాగా పెరగనుంది. శిక్షణ సంస్థలు కూడా క్లౌడ్‌ ప్రోగ్రామింగ్‌పై దృష్టిసారిస్తున్నాయి. వర్చువల్‌ విధానంలో ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకునేందుకు గాను కంపెనీలు వినూత్న పద్ధతులను పాటిస్తున్నాయి.

చాలా కంపెనీలు ప్రతిభ ఉన్న వారినే తీసుకుంటున్నాయి.? దీనిపై..

సాధారణంగా ఏ కంపెనీ అయినా అనుభవం ఉన్న వారి నుంచి కచ్చితంగా నైపుణ్యాలను ఆశిస్తుంది. అదే ఫ్రెషర్స్‌ విషయానికొస్తే కేవలం విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉంటే రిక్రూట్‌ చేసుకుంటాయి. కోర్సులో భాగంగా వారు నేర్చుకున్న అంశాలకు ట్రెయినింగ్‌ కాస్త మెరుగులు అద్ది ప్రాజెక్టులోకి తీసుకుంటారు. మా కంపెనీ విషయానికొస్తే.. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను మేము బాగా విశ్వసిస్తాము. ఇందులో భాగంగా కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన అభ్యర్థులను తీసుకుంటున్నాం.

డిమాండ్‌, సప్లైలో సమానత్వం ఎప్పుడు వస్తుంది..?

ప్రస్తుతం మేము వర్క్‌స్పేస్‌లో ఐదు జనరేషన్స్‌కు చెందిన అభ్యర్థులను తీసుకుంటున్నాం. 3 నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో జీతాలు పెరుగుతున్నాయి. రానున్న 2 నుంచి 3 క్వార్టర్స్‌లో కంపెనీలు ఎక్కువగా ఫ్రెషర్స్‌ని తీసుకునే అవకాశాలున్నాయి. ఇది డిమాండ్‌, సప్లైని స్థిరీకరిస్తుందని నేను భావిస్తున్నాను.

పని చేసే చోటును బట్టి జీతం మారనుందా..?

అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగుల జీతాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు కాలిఫోర్నియాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జీతంతో పోలిస్తే, డల్లాస్‌లో పనిచేసే ఉద్యోగి జీతం తక్కువగా ఉంటుంది. ఇది వారికి కొత్తేమి కాదు. అయితే భారత్‌లో ప్రాంతాన్ని బట్టి జీతాన్ని నిర్ణాయించడం చాలా తక్కువేనని చెప్పాలి. ముంబయి, ఢిల్లీలాంటి మెట్రో పట్టణాలతో పోలిస్తే ఇతర ప్రాంతాల్లో లొకేషన్‌ ఆధారంగా జీతాలు నిర్ణయించడం ప్రస్తుతానికి ఆచరణీయమైన విధానం కాదని నా అభిప్రాయం.

Also Read: Viral News: బాయ్‌ఫ్రెండ్ కోసం యువతుల ఫైట్.. నడి రోడ్డు కాస్తా బాక్సింగ్ రింగ్ అయిపోయింది

Bogus Challan Scam: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీలు.. కోట్లలో కొల్లగొడుతున్న అధికారులు.. వెలుగు చూసిన భారీ స్కామ్..

Vijayanagaram: ఆ విగ్రహం ఇంట ఉంటే దరిద్రం వదులుతుంది, సిరుల పంటే అంటారు.. కొంటే సీన్ సితారే

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే