AAI Recruitment: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం.
AAI Recruitment 2021: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోలిటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భారీ వేతనంతో పాటు మంచి భవిష్యత్తు ఉన్న ఏవియేషన్ రంగంలో...
AAI Recruitment 2021: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోలిటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భారీ వేతనంతో పాటు మంచి భవిష్యత్తు ఉన్న ఏవియేషన్ రంగంలో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం ఈ నోటిఫికేషన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* పలు విభాగాల్లో మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) – 14, సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) – 06, సీనియర్ అసిస్టెంట్స్ (ఎలక్ట్రానిక్స్) – 09 ఖాళీలున్నాయి. * సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎల్‌ఎమ్‌వీ లైసెన్స్‌తో పాటు మేనెజ్‌మెంట్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. * సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) ఖాళీలకు అప్లై చేసుకునే వారు బీకామ్ డిగ్రీతో పాటు 3-6 నెలల వ్యవధిలో ఏదైనా కంప్యూటర్ కోర్స్ చేసి ఉండాలి. * సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూన్ 30, 2021 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 36,000 నుంచి రూ.1,10,000 వరకు జీతాన్ని అందిస్తారు. * దరఖాస్తుల స్వీకరణ తేదీ 29-07-2021న మొదలుకాగా 31-08-2021తో ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. * నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Telangana School Reopen: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ ఆరోజు నుంచేనా..?