AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana School Reopen: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ ఆరోజు నుంచేనా..?

రాష్ట్రంలోని విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Telangana School Reopen: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ ఆరోజు నుంచేనా..?
Telangana Schools
Balaraju Goud
|

Updated on: Aug 12, 2021 | 6:24 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. లాక్‌డౌన్ విధించి ప్రభుత్వం. అన్ని వాణిజ్య కార్యకలాపాలతోపాటు విద్యాసంస్థలు మూతపడ్డాయ. రెండేళ్లుగా మూతపడిన రాష్ట్రంలోని విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఉన్న తరగతుల విద్యార్థలకు అనుమతినిచ్చి.. ఆ తర్వాత ప్రాథమిక స్థాయి పాఠశాలలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచేందుకు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇక, ఇంటర్ ఫస్టియర్‌ అడ్మిషన్ల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. Telangana Education Minister Meeting With Officers ఇదిలావుంటే, రాష్ట్రంలో విద్యాభివృద్దికోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వ విద్యపై విద్యార్థులకు నమ్మకం పెరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్‌లో గణనీయంగా అడ్మిషన్లు పెరిగాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య 52 వేలు నుంచి 1.90 లక్షలు దాటిందన్నారు. ఇంటర్ విద్యలో సంస్కరణలు అమలు చేశామన్నారు. ప్రతి ఐదేళ్లకొకసారి సబ్జెక్ట్ రివైజ్ చేశామన్నారు. సెకండియర్ తెలుగు, ఫస్టియర్ ఇంగ్లీష్ పాఠ్యాంశాల్లోనూ మార్పులు చేశామన్నారు. ఇక, రాష్ట్రంలోని విద్యార్థలందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఉచిత పుస్తకాలకు 9 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Read Also…  Viral Video: హోరాహోరీగా ఫుట్‌బాల్ మ్యాచ్.. హఠాత్తుగా రెండేళ్ల బాలుడి ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే? వైరలవుతోన్న వీడియో

Puri Jagannath Temple: ఇవాళ తెరుచుకున్న పూరీ జగన్నాథుడి ఆలయం.. భక్తులకు అనుమతి ఎప్పటి నుంచి అంటే..?