SAIL Rourkela Recruitment 2022: టెన్త్‌/ఇంటర్ అర్హతతో స్టీల్ ప్లాంట్‌లో 200 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Rourkela Steel Plant)లో.. 200 ట్రైనీ (Medical Attendant Training Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

SAIL Rourkela Recruitment 2022: టెన్త్‌/ఇంటర్ అర్హతతో స్టీల్ ప్లాంట్‌లో 200 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Sail Rourkela
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 18, 2022 | 10:09 AM

SAIL Rourkela Medical Attendant Training Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Rourkela Steel Plant)లో.. 200 ట్రైనీ (Medical Attendant Training Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ/ఫార్మసీలో డిప్లొమా, బీఫార్మసీ, మేనేజ్‌మెంట్‌/హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ/బీబీఏ/పీజీ డిప్లొమా/బీపీటీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి అక్టోబర్‌ 8, 2022వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.9,000ల నుంచి రూ.17,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • మెడికల్ అటెండెంట్ ట్రైనింగ్‌ పోస్టులు: 100
  • క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనింగ్‌ పోస్టులు: 20
  • అధునాతన ప్రత్యేక నర్సింగ్ ట్రైనింగ్‌ పోస్టులు: 40
  • డేటా ఎంట్రీ ఆపరేటర్/ మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ ట్రైనింగ్‌ణ పోస్టులు: 6
  • మెడికల్ ల్యాబ్. టెక్నీషియన్ ట్రైనింగ్‌ పోస్టులు: 10
  • హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్‌ పోస్టులు: 10
  • OT/ అనస్థీషియా అసిస్టెంట్ ట్రైనింగ్‌ పోస్టులు: 5
  • అధునాతన ఫిజియోథెరపీ ట్రైనింగ్‌ పోస్టులు: 3
  • రేడియోగ్రాఫర్ ట్రైనింగ్‌ పోస్టులు: 3
  • ఫార్మసిస్ట్ ట్రైనింగ్‌ పోస్టులు: 3

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.