RITES Recruitment 2022: బీఈ/బీటెక్ అర్హతతో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన హర్యాణాలోని గుడ్‌గావ్‌లోనున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES Haryana).. ఒప్పంద ప్రాతిపదికన 11 ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల (Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
RITES Engineer Electrical Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన హర్యాణాలోని గుడ్‌గావ్‌లోనున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES Haryana).. ఒప్పంద ప్రాతిపదికన 11 ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల (Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజీనీరింగ్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తిబకలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.300లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.22,000ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.